Health: చంకలో చెమటతో ఇబ్బంది పడుతున్నారా..? చెమట చంకలో పేరుకుపోవడం వల్ల నలుగురిలో తిరగాలంటే అవమానంగా ఫీలవుతున్నారా..? కొందరికైతే చంకల్లో చెమట బాగా వచ్చి.. అక్కడ మరకలా ఏర్పడుతుంది. అంతేకాకుండా దుర్వాసన వస్తుంది. దీనివల్ల నలుగురిలోకి వెళ్లడానికి ఇష్టపడరు. ఎండాకాలమైతే మాములుగా కొద్దిసేపు బయట ఉంటే ఇట్టే చమటలతో తడిసిపోతాం. ఇక తక్కువ చెమట రావడం సర్వ సాధారణమే. చమట అనేది ఎండలో శారీరక పని వల్ల కానీ.. మానసిక ఒత్తిడి వల్ల కానీ.. కొందరకి వారీ శరీరాన్ని బట్టి కూడ వస్తుంది. అయితే చంకల్లో చెమటను తగ్గించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
Read Also: Anchor Suma: అయ్యో సుమకు ఏమైంది.. ఏంటా దెబ్బలు..?
అండర్ ఆర్మ్ చెమటను తగ్గించేందుకు ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండటం చాలా చాలా అవసరం. దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి మీ అండర్ ఆర్మ్స్ ను యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో క్రమం తప్పకుండా కడగండి. అంతేకాకుండా స్నానం చేసిన తర్వాత మీ చంకలను బాగా ఆరబెట్టుకోవాలి. మరోవైపు డియోడరెంట్ల కంటే యాంటిపెర్స్పిరెంట్లను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే ఇవి చెమట రాకుండా.. చెమట ఉత్పత్తిని తగ్గించడానికి సహాయపడతాయి. అల్యూమినియం క్లోరైడ్ కలిగి ఉన్న యాంటీ పెర్స్పిరెంట్లను వాడండి. ఇది చెమట గ్రంథులను నిరోధించడానికి సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు వీటిని పెట్టుకోవాలి.
Read Also: Lucknow Horror:14 ఏళ్ల బాలికపై బాలుడి అత్యాచారం.. ఆపై సుత్తితో కొట్టి, ఫ్యాన్‌కు ఉరేసి.. !
చెమట రాకుండా ఉండటానికి చంకలకు గాలి చేరేలా, తేమను గ్రహించే పత్తి, నార లేదా వెదురు వంటి సహజ వస్త్రాలను వాడాలి. నైలాన్ లేదా పాలిస్టర్ వంటి సింథటిక్ దుస్తులను వాడితే.. ఇంకా చెమట వస్తుంది. అందుకని అలాంటి వస్త్రాలను ధరించకూడదు. ఇక చెమట రావడానికి అతి ముఖ్యమైన కారణమేంటంటే.. ఒత్తిడి, ఆందోళన. ఇవి ఉన్నాయంటే ఆటోమెటిక్ గా చెమటలు వస్తూనే ఉంటాయి. అందుకు తరుచుగా యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు లాంటివి చేస్తే ఒత్తిడిని తగ్గించి.. చెమట రాకుండా శరీరానికి తోడ్పడుతుంది. బరువు కూడా ఎక్కువగా ఉండటం వల్ల కూడా చెమట ఎక్కువగా పడుతుంది. అలాగే అండర్ ఆర్మ్స్ లో చెమట ఎక్కువగా పట్టడానికి కొన్ని రకాల ఆహారాలు కూడా కారణమవుతాయి. కారంగా ఉండే ఆహారాలు, కెఫిన్, ఆల్కహాల్, వేడి పానీయాలను తీసుకుంటే మీకు చంకల్లో చెమట ఎక్కువగా పడుతుంది. ఎక్కువగా నీటిని తాగితే మీ శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి.. చెమటను తగ్గిస్తుంది.