The Lancet Report: దేశంలో పెరుగుతున్న బీపీ, షుగర్ బాధితులు.. లాన్సెట్ నివేదికలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Lancet Report:దేశంలో గుట్టుచప్పుడు కాకుండా బీపీ, షుగర్ తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ది లాన్సెట్ డయాబెటిక్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశ జనాభాలో 11.4 శాతం మంది షుగర్ తో బాధపడుతున్నారు. 35.5 శాతం మంది అధిక రక్తపోటు(హైబీపీ)తో బాధపడుతున్నట్లు నివేదించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)తో మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ కలిసి ఈ అధ్యయాన్ని నిర్వహించాయి. అన్ని రాష్ట్రాల్లోని భౌగోళిక పరిస్థితులు, జనాభా, సామాజిక-ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని దశలవారీగా పరిశోధకులు అధ్యయనం చేశారు. 2008-2020 మధ్యకాలంలో దేశంలోని 1.1 లక్షల మందిపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ప్రజల్లో బీపీ, షుగర్ వ్యాధులు పెరుగుతున్నట్లు తేటతెల్లం అయింది.
Read Also: Good news : కేంద్రం అదిరిపోయే న్యూస్.. ఆడపిల్ల పుడితే రూ.6వేలు..
Also Read
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
దేశ జనాభాలో 15.3 శాతం ప్రజలు ప్రి-డయాబెటిస్( షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి) స్థితికి చేరారని, 28.6 శాతం మంది ప్రజలు సాధారణ ఊబకాయంతో బాధపడుతున్నారని, 39.5 శాతం ప్రజలు ఉదర సంబంధిత ఊబకాయంతో బాధపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. 81.2 శాతం ప్రజల్లో డిస్‌లిపిడేమియా( లిపిడ్స్ లో అసమతుల్యత) ఉందని నివేదికలో వెల్లడైంది. దేశంలో షుగర్, ఇతర సంక్రమిత వ్యాధుల బాధితుల సంఖ్య గతంలో అంచనా వేసిన దానికన్నా ఎక్కువగా ఉందని, అభివృద్ధి చెందిన రాస్ట్రాల్లో ఈ సంఖ్య స్థిరంగా ఉన్నా.. చాలా రాష్ట్రాల్లో పెరుగుతున్నట్లు సర్వే పేర్కొంది. ఈ ఆరోగ్య సమస్యలు ప్రమాదకరస్థాయికి చేరుతున్నందున వెంటనే అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..