ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (Diabetes) ఒక పెను సవాలుగా మారిన తరుణంలో, అమెరికాలోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక వినూత్న పరిశోధనను విజయవంతం చేశారు. తీపిని ఇష్టపడే మధుమేహ వ్యాధిగ్రస్తులు సాధారణ చక్కెర (సుక్రోజ్)కు ప్రత్యామ్నాయంగా ఈ టాగటోజ్ ను వాడుకోవచ్చు. ఇది రుచిలో పంచదారకు దాదాపు 92 శాతం సమానంగా ఉంటుంది, కానీ శరీరంలోకి చేరాక అది చూపే ప్రభావం మాత్రం చాలా భిన్నంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. సాధారణ చక్కెర తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు…
సాధారణంగా ఒక వ్యక్తి మత్తులో ఉన్నాడంటే అతను మద్యం సేవించి ఉంటాడని మనం భావిస్తాం. కానీ, అసలు మందు చుక్క ముట్టుకోకపోయినా, తాగిన వాడిలాగే తూలుతూ, నోటి నుంచి ఆల్కహాల్ వాసన వస్తూ, విపరీతమైన మత్తులో మునిగిపోయే ఒక వింత పరిస్థితి గురించి మీకు తెలుసా? వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా, ఇది ఒక అరుదైన వైద్య స్థితి. దీనినే వైద్య పరిభాషలో ‘ఆటో-బ్రూవరీ సిండ్రోమ్’ (Auto-Brewery Syndrome) లేదా ‘గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్’ అని పిలుస్తారు. ఈ…
స్మార్ట్ ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్లో భాగం అయిపోయింది. నిద్ర లేచింది మొదలు మళ్లీ బెడ్ టైమ్ వరకు గంటల కొద్దీ ఫోన్ లోనే గడిపేస్తున్నారు. కాల్స్, రీల్స్, ఎంటర్ టైన్ మెంట్ వీడియోలు, సినిమాలు, సోషల్ మీడియాలో సమయం గడపడానికి ఉపయోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ ను టైమ్ పాస్ కోసం కాకుండా తెలివిగా ఉపయోగించుకుంటే నైపుణ్య అభివృద్ధికి సహాయపడుతుంది. ఆదాయ వనరుగా కూడా మారుతుంది. స్టడీ, హెల్త్ ట్రాకింగ్, డిజిటల్ చెల్లింపులు, వృత్తిపరమైన పని,…
విద్య, ఆరోగ్యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండోర్‌లో ఆయన మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్యం.. ఈ రెండూ కూడా సామాన్యుడికి దూరమైపోయాయని తెలిపారు.
Shocking : ఈ ప్రపంచంలో రోజుకో కొత్తరకమైన, విచిత్రమైన వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. వైద్య శాస్త్రాన్ని, నిపుణులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసే ఈ కొత్త కేసులు ఎంతగానో కలవరపెడుతున్నాయి. అలాంటి ఘటనే తాజాగా చైనాలో చోటుచేసుకుంది. ఇది ఏ కథనమో కాదు.. నిజంగా నోటికొచ్చే నమ్మలేని వార్తే..! పూర్వ చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఉన్న యాంగ్‌ఝౌ నగరానికి చెందిన 8 ఏళ్ల బాలిక శరీరంలో నెలరోజులుగా ఓ విచిత్రమైన సంఘటన జరుగుతోంది. ఆ చిన్నారి ఎప్పటికప్పుడు వాంతి…
AI : రక్త పరీక్ష అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది – సూదితో రక్తం తీసే ప్రక్రియ. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, నడుమున్న వయసువారు దీనికి కొంచెం భయపడుతుంటారు కూడా. కానీ ఇప్పుడు ఆ భయాన్ని పూర్తిగా తొలగించే దిశగా ఆరోగ్యరంగం ముందడుగు వేసింది. హైదరాబాదులోని ప్రసిద్ధ ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్ హాస్పిటల్ దేశంలోనే తొలిసారిగా సూదిరహిత రక్త పరీక్షలు చేసే సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఇది కేవలం వైద్యరంగంలోనే కాదు, టెక్నాలజీ వినియోగంలోనూ ఒక విప్లవాత్మక ముందడుగుగా…
Vaccination: వైద్యారోగ్య చరిత్రలో ‘‘వ్యాక్సిన్’’ అనేది అద్భుత సృష్టిగా చెప్పవచ్చు. ప్రాణాంతక వ్యాధుల నుంచి టీకాలు ప్రజల్ని కాపాడుతున్నాయి. పుట్టిన ప్రతీ బిడ్డకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ కుడి చేతికి వేస్తే మంచిదా.? ఎడమ చేతికి వేస్తే మంచిదా..? అనే దానిపై ఆస్ట్రేలియన్ పరిశోధకులు రీసెర్చ్ చేశారు. ‘‘వ్యాక్సిన్ మొదటి డోస్ ఏ చేతికి ఇస్తారో, బూస్టర్ డోస్ కూడా అదే చేతికి ఇస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి’’ అని ఈ రీసెర్చ్‌లో వెల్లడించారు.
ఆపిల్ తో పోలిస్తే అరటి పండ్ల ధరలు చాలా తక్కువ. కానీ, ప్రయోజనాల్లో మాత్రం ఆపిల్ కి గట్టిపోటినిస్తుంది. అరటి పండ్లను పోషకాల పవర్ హౌజ్ గా చెప్పుకుంటాం. అరటిపండు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఇది ఏడాది పొడవునా మార్కెట్లో లభిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం మొదలైన అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి,…
మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టీవీ, ఇవి మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. అవి లేకుండా మనం ఆఫీసులో పనిచేయలేం. పడుకోము, తినము. పెద్దవారిలోనే కాదు పిల్లల్లో కూడా స్క్రీన్ అడిక్షన్ బాగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు తమ పని తాము చేసుకునేందుకు చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. పిల్లలు క్రమంగా దానికి బానిసలవుతున్నారు. పిల్లవాడు మొబైల్ చూడకుండా తిండి తినడు. మొబైల్ ని ముందు పెట్టుకుని తినే పిల్లలను మీరు కూడా చాలా మంది చూసి ఉంటారు.…
దేశ రాజధాని దిల్లీ తరహాలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం పెరుగుతోంది. దుమ్మూ, ధూళి, వాహనాల పొగ.. గాలిలో కలవడం లేదు. పైపైనే ఒక పొరలా పేరుకుపోతోంది. దీంతో గాల్లో కాలుష్యం పెరిగి.. వాయు నాణ్యత తగ్గుతోంది. దీంతో గాల్లో నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి ఎక్కువగా కలుషితమవుతోంది. ఈ వాయు కాలుష్యం ధాటికి ఊపిరితిత్తులు విలవిలలాడుతున్నాయి.