Heart Attack: ఇటీవల కాలంలో మూడు పదులు వయసులోపు యువత గుండెపోటు బారిన పడటం చూస్తున్నాం. అంతా ఫిట్ గా ఉన్నట్లు బయటకు కనిపిస్తున్నా.. హఠాత్తుగా వచ్చే విపత్తును గుర్తించలేకపోతున్నారు. ఇటీవల ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ గుజరాత్ లోని జామ్ నగర్ లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. గుండె వ్యాధుల నిపుణుడైన డాక్టరే తనకు వచ్చే గుండెపోటును గుర్తించలేెపోయారు. మంగళవారం ఉదయం ఆయన మరణించారు.
గతంలో 65 ఏళ్లు పైబడినవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ అని మనం అంతా అనుకునేవాళ్లం. అయితే ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా 30-40 ఏళ్లలోనే గుండెపోటు బారిన పడుతున్నారు. విచిత్రం ఏంటంటే టీనేజ్ వయసులో కూడా గుండెపోటుతో మరణించిన ఘటనలు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
Read Also: WTC FINALలో దుమ్మురేపుతున్న ఆసీస్ ఆటగాళ్లు.. చెమటోడుస్తున్న భారత బౌలర్లు
యువతలో గుండెపోటు రావడానికి కారణాలు:
హైబీపీ, స్మోకింగ్, కుటుంబంలో హార్ట్ ఎటాక్ కు సంబంధించిన చరిత్ర, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు, అనియంత్రిత ఒత్తడి, అనారోగ్యమై-అసంతులిత ఆహారం, తక్కువ శారీరక శ్రమ వంటివి యువతలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. గుండె ఆరోగ్యాన్ని గమనించేందుకు తరుచుగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను పరీక్షించుకోవాలి. ఒకవేళ ఉండాల్సిన దాని కన్నా ఎక్కువగా ఉంటే వాటికి సంబంధించిన నియమాలు, డైట్ పాటించాలి.
గుండెపోటు లక్షణాలు:
గుండెపోటు చికిత్సలో సమయం చాలా కీలకం. ఎంత త్వరగా రోగిని ఆస్పత్రికి తీసుకువస్తే, బతికించే ఛాన్సులు అంత మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా గుండెపోటుకు సంబంధించిన లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. ఈ కింది లక్షణాలు ఉంటే గుండెపోటుగా అనుమానించాలి.
*ఛాతీలో బిగుతు
*ఛాతీలో నొప్పి
*వికారం
*గుండెల్లో మంట
*శ్వాస ఆడకపోవుట
*చల్లని చెమట
*అలసట
*గుండెల్లో మంట
*అసమాన హృదయ స్పందన
సైలెంట్ హార్ట్ ఎటాక్:
కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండా గుండెపోటు సంభవిస్తుంటుంది. దీన్ని ‘సైలెంట్ హార్ట్ ఎటాక్’గా పిలుస్తుంటారు. దీంట్లో లక్షణాలు తక్కువగా ఉండటం లేదా పూర్తిగా లేకపోవడం వంటివి జరుగుతాయి. అయితే గుండెల్లో మంట, ఛాతి కండరాలు ఒత్తిడికి గురవ్వడం వంటి లక్షణాలు ఇందులో ఉంటాయి. నిశ్శబ్ద గుండెపోటులు మరియు సాధారణ గుండెపోట్లు రెండూ గుండెకు రక్త ప్రసరణను అడ్డుకోవడం వల్ల సంభవిస్తాయి.