Health Tips: వేప ద్వారా మనకు ఎన్ని ప్రయోజనాలున్నాయో చెప్పక్కర్లేదు. పల్లెటూర్లళ్లైతే పొద్దున లేవగానే వారి పండ్లు తోముకోవడానికి వేప పుల్లను వాడుతారు. దాని కాండం నుంచి మొదలు పెడితే వేర్లు, చిగుళ్లు, విత్తనాలు వరకు ఆరోగ్యానికి మేలు చేసేవిగా ఉంటాయి. వేప చేదుగా ఉన్నా.. దానిలో మాత్రం ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. వేప అద్భుతమైన శీతలీకరణ ఏజెంట్. ఇది హైపర్ అసీడిటీ, మూత్ర మార్గ రుగ్మతలు, చర్మ వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. వేప ఆకులతో ఎన్నో ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యల నుంచి బయటపడొచ్చు. వేపాకులతో ముఖ్యంగా పిత్తాన్ని సమతుల్యం చేయడంతో పాటు.. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Read Also: Gopichand31: అందరు అయిపోయారు.. ఇప్పుడు కన్నడ డైరెక్టర్ తోనా మాస్టారు
అలాగే వేపతో మానవుని జీర్ణక్రియ మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలసట, దగ్గు, దాహం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. పల్లెటూర్లలో దెబ్బతగిలితే వెంటనే వేపాకు రసాన్ని గాయంపై పోస్తారు. దాని వల్ల ఆ గాయం శుభ్రమౌతుంది. తొందరగా నయం అయ్యేందుకు సహాయపడుతుంది. అలాగే వేప ఆకులు వికారం, వాంతుల నుంచి రిలీఫ్ కలిగిస్తుంది. అలాగే శరీరంలో మంటను తగ్గించేందుకు కూడా సహాయపడుతుందని వైద్యపరంగా నిరూపించబడింది.
Read Also: Big Breaking: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. పింఛన్ పెంపు
వేప ఆకులను వేడినీటిలో మరిగించి స్నానం చేస్తే చాలా మంచింది. దానివల్ల చుండ్రు, తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా జుట్టు కూడా షైనీగా మారిపోతుంది. మనకు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు.. వేపనీటి కషాయం తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. వేపతో మధుమేహం, చర్మవ్యాధులు, జ్వరం, రోగనిరోధక శక్తి, జ్వరాలు మొదలైన సమస్యల చికిత్సకు ఉపయోగించొచ్చు. అంటే మాత్రలు, పౌడర్లు, జ్యూసుల రూపంలో తీసుకోవచ్చు. అయితే ఇది రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.