World Brain Tumour Day: మీరు తరచుగా తలనొప్పిని కలిగి ఉన్నట్లయితే, అది భయానకంగా ఉంటుంది. నొప్పి కొనసాగితే లేదా పునరావృతమైతే, ఇది బ్రెయిన్ ట్యూమర్ వంటి తీవ్రమైన సమస్య అని మీరు భావించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. తలనొప్పి అనేది చాలా అరుదుగా వచ్చే మెదడు కణితికి సంకేతం లేదా లక్షణం. బ్రెయిన్ ట్యూమర్‌కు దోహదపడే అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. తలనొప్పి మెదడు కణితికి సంకేతంగా ఉండే అవకాశాలు చాలా అరుదు అని న్యూరో సర్జన్లు సూచిస్తున్నప్పటికీ, మీకు నొప్పి కొత్తగా అనిపిస్తే, ఎక్కువగా అవుతుంటే, తీవ్రమైన సమస్యలు వస్తే వైద్యుడిని సందర్శించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. .
పూణేలోని సూర్య మదర్ అండ్ చైల్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ కులకర్ణి మాట్లాడుతూ.. పెద్దలు, పిల్లలు ఇద్దరూ తలనొప్పి, తల తిరగడం చాలా తీవ్రంగా పరిగణించాలని, వాటికి వివిధ కారణాలు ఉండవచ్చు అని తెలిపారు. ఆ నొప్పి ఎందుకు వస్తుందో ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరమన్నారు. కచ్చితమైన రోగ నిర్ధారణ, సమర్థవంతమైన చికిత్స అందించడం కోసం వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యమని అని డాక్టర్ విశ్వనాథ్ కులకర్ణి చెప్పారు.
తలనొప్పులు, మైకము, మూర్ఛలు, క్షణికావేశంలో స్పృహ కోల్పోవడం, అవగాహన కోల్పోవడం, ఏదైనా బలహీనత వంటివి మెదడు కణితి ప్రారంభ సంకేతాలు లేదా లక్షణాలు అని జినోవా షాల్బీ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ముంబైకి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ ఆకాష్ ఛేడా అన్నారు. మెదడులో కణితి ఎక్కడ ఉందో దానిపై ఆధారపడిన శరీరంలోని భాగం ఎఫెక్ట్ అవుతుందన్నారు. .”సాధారణంగా మైగ్రేన్ తలనొప్పి లేదా సాధారణ తలనొప్పి దీర్ఘకాలిక తలనొప్పిగా ఉంటుంది. అయితే తలనొప్పిలో మార్పు వచ్చినప్పుడు, అది ఒక ప్రాంతంలో వస్తుంటే అది తీవ్రమైన సమస్య కావచ్చు” అని డాక్టర్ ఆకాష్ చెప్పారు. తలనొప్పి మీ నిద్రకు భంగం కలిగిస్తే లేదా తెల్లవారుజామున వాంతులు వచ్చినట్లయితే, అది ఒక సంకేతం అని ఆయన చెప్పారు. పిల్లలకు తలనొప్పి వచ్చే సందర్భాలు చాలా అరుదు. అలా కాకుండా పిల్లలు నిరంతరంగా తలనొప్పితో బాధపడుతుంటే వైద్యులు సంప్రదించడం చాలా ముఖ్యమని డాక్టర్ విశ్వనాథ్ కులకర్ణి సలహా ఇచ్చారు. అదనంగా, శారీరక పరీక్షలో తక్కువ హృదయ స్పందన రేటు, పెరిగిన రక్తపోటు లేదా అసాధారణ పల్స్ వంటి అసాధారణ ఫలితాలను తీవ్రంగా పరిగణించాలి.
రోగ నిర్ధారణ, చికిత్స
సాధారణంగా ఉపయోగించే డయాగ్నస్టిక్ టూల్స్‌లో ఏదైనా నిర్మాణ అసాధారణతలను గుర్తించడానికి మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI), రక్తనాళాలను అంచనా వేయడానికి మాగ్నెటిక్ రెసొనెన్స్ యాంజియోగ్రఫీ (MRA) లేదా కంప్యూటెడ్ టోమోగ్రఫీ యాంజియోగ్రఫీ (CTA) వంటి వాస్కులర్ అధ్యయనాలు, కొన్ని సందర్భాల్లో సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ వంటి మెదడు ఇమేజింగ్ పద్ధతులు ఉన్నాయి. ఎలెక్ట్రోఎన్సెఫలోగ్రఫీ (EEG) కొన్ని తలనొప్పి రుగ్మతలు లేదా మూర్ఛ కార్యకలాపాలను గుర్తించడంలో సహాయపడుతుంది. అనేక సార్లు, న్యూరో-నేత్రవైద్యులు, ఓటోలారిన్జాలజిస్టులు లేదా న్యూరోసర్జన్లు లక్షణాలను నిర్ధారించడానికి వీటిని వాడుతారు.