ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని రక్షించుకుంటే.. జీవితకాలంలో ఏర్పడే వ్యాధులకు దూరంగా ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండా చేసే అలవరుచుకునే ఆహారా అలవాట్లతో మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఏమి తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నా.. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఇదే విషయాన్ని ప్రతి ఇంట్లోని పెద్దవారు చెబుతూనే ఉంటారు. అయితే.. ఉపవాసం చేయడం వల్ల ఖాళీ కడుపుతో, చాలా మందికి ఎసిడిటీ, కడుపు…
మన దేశంలో అల్లం అంటే తెలియనివారు ఉండరు. దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం కూడా లేదు. వంటల్లో వాడే అల్లంను సూపర్ ఫుడ్ అంటారు. అయితే దీన్ని తినడం వల్ల సౌందర్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. చర్మం, జుట్టు సంరక్షణలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా ఇది స్కిన్, హెయిర్ కేర్ ప్రొడక్ట్‌గా కూడా ఉపయోగపడుతుంది. జుట్టు…
అనేక రకాల పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యాన్ని మరింత పెంచుతాయి. మనలో చాలామంది రోజు ఏదో ఒక పండు ని ఖచ్చితంగా తింటారు. కొందరు ఉదయాన్నే ఏదో ఒక పండు తినడం లేదా మరికొందరేమో ఉపవాసం చేశాక ఖాళీ కడుపుతో ఏదో ఒక పండు తో తమ ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే ఎప్పుడు తింటే ఏంటి? పండ్లే కదా .. ఆరోగ్యానికి మంచివే కదా అని వాటిని ఎప్పుడుపడితే అప్పుడే తింటాం. అయితే వాటిని ఎప్పడుబడితే అప్పుడు…
నాజూకైన నడుము.. ఈ తరం యువతుల మోజు! నలుగురిలో అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు.. అమ్మాయిలు సన్నగా తయారవ్వాలని కోరుకుంటారు. అందుకోసం ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ సులువైన చిట్కాలు. వీటిని తరచుగా పాటిస్తే.. అనతి కాలంలోనే మంచి రిజల్ట్‌ని పొందుతారు. అవేంటంటే.. 1. తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవాలి. జంక్‌ఫుడ్, వేపుళ్లు, చాక్లెట్లు మొదలైన వాటికి స్వప్తి చెప్పి.. పండ్లు, కూరగాయలు, గుడ్లు, చేపలు వంటివి తినాలి. వీటిని…
ప్రస్తుత ఉరుకు, పరుగుల జీవితంలో మానవులు మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నా.. పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేకపోతున్నారు. అఫ్కోర్స్.. వ్యాయామాలు, క్రమం తప్పకుండా నియమాలు పాటిస్తే.. ఆరోగ్యంగా మెలగొచ్చు. కానీ, కొందరు అవి సాధ్యపడకపోవచ్చు. బిజీ లైఫ్ కారణంగానో, ఏ ఇతర సమస్యల వల్లనో.. ఆరోగ్య సూత్రాల్ని సరిగ్గా పాటించలేకపోతారు. అలాంటి వారి కోసం ఈ ‘షిబారి’ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. షిబారి (పట్టుకో)..…
వేసవి కాలం వచ్చిందంటే రకరకాల ఆందోళనలు మనల్ని ముంచెత్తుతాయి. కారణం చెమటలు పట్టడం, అధిక వేడి, ఇలా అన్ని సమస్యలే. అందుకే శరీరంలో వేడి పెరగకుండా చూసుకోవడానికి చాలా మంది వేసవి పండ్ల కోసం వెతుకుతున్నారు. తద్వారా వేసవి నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. అదేవిధంగా వేసవిలో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవి ఎండలకు ఎక్కువగా గురయ్యే ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన తల మాత్రమే. ఇది నేరుగా సూర్యరశ్మి, అధిక…
ఫ్రెండ్స్ కలిసినా, లేక ఇంటికి బంధువులు వచ్చినా టీ, లేదా కాఫీ ఇస్తాం. అయితే మనలో చాలా మందికి రోజు కాఫీ, టీ తోనే మొదలవుతోంది. కాఫీ మన ఉదయాన్ని ఉత్తేజంగా స్టార్ట్ చేయిస్తోంది. అయితే అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ అధ్యయనంలో పలు రకాల కాఫీ తాగడం వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ అని తేలింది. కాఫీ తాగని వారికే ఎక్కువ డెత్ రిస్క్ అని ఈ అధ్యయనం తేల్చింది. యునైటెడ్ కింగ్డమ్లో 171,616…
మన ఆరోగ్యానికి విటమిన్ ‘సి’ తగిన మోతాదులో అందడం చాలా ముఖ్యం. ఎముకల అభివృద్ధికి, రక్త నాళాల పనితీరుకు, గాయాలు త్వరగా నయం కావడానికి..విటమిన్ సి అత్యవసరం. ఇది లోపిస్తే అనేక వ్యాధులు శరీరంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. 1. స్కర్వీ విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఇది. ఆహారం ద్వారా తగినంత సి విటమిన్ అందనప్పుడు స్కర్వీ లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, గాయాల నుంచి…
ప్రస్తుత కాలంలో చిన్న వయసులో కూడా గుండెపోటుతో అకస్మాత్తుగా మృత్యువాత పడుతున్న ఘటనలు మనం చూస్తూనేవున్నాం. చిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధులు రావడం లాంటి అనేక సమస్యలను చూస్తూనే ఉన్నాం. ఉప్పు ఎక్కువ తింటే హై బీపీ వస్తుంది అని ,మాత్రమే ఎక్కువమందికి తెలుసు. కానీ చెక్కర ఎక్కువ తీసుకున్న గాని గుండెకు ప్రమాదం అని చాలా తక్కువమందికి తెలుసు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తగిన స్థాయిలో నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన…
ప్రస్తుతం పట్టపగలే ఎండకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండల తీవ్రత ఎక్కువ అవుతోంది. సాయంత్రం 6 కానిదే తగ్గడం లేదు. దీనికితోడు ఉక్కపోత, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపానికి జనం బయటకు రాలేని పరిస్థితి. ఇంట్లో ఏసీలు, కూలర్లు 24 గంటల పాటు వినియోగించాల్సి వస్తోంది. అయితే ఆలా అని ఇంట్లో ఉంటే కుదరదు కదా? అలాగని ఎండ బారిన పడితే వచ్చే అనర్థాలను తట్టుకునే పరిస్థితి ఉండదు.…