బరువు తగ్గాలి అనుకునేవారికి చాలామంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు బరువు తగ్గడానికి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటారు కానీ వాస్తవానికి చాలావరకు వాటి వెనుక శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ మీ బరువు తగ్గడానికి అవరోధంగా నిలిచే పదార్థాల గురించి తెలుసుకుని, వాటికి దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా పొట్ట కొవ్వు కరగడం కోసం, బ్రెడ్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలి. వాకింగ్ లాంటివి చేసినా కూడా ప్రతిఫలం పెద్దగా ఉండదు.
అయితే.. కొన్ని రకాల ఆహారాలు.. కొవ్వును తగ్గించడంలో ముందు వరసలో ఉంటాయి అంటున్నారు ఆహార నిపుణులు. మరి అవేంటో మనమూ ఓసారి చూసేద్దామా…
1.ఉసిరికాయలు.. వీటిని నిత్యం తీసుకుంటే అధిక బరువు సులభంగా తగ్గుతుంది. అలాగే పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది. బరువు తగ్గించడంలో ఉసిరి అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఉసిరి కాయ రసాన్ని తాగితే ఫలితం ఉంటుంది.
2. జీలకర్ర…గుప్పెడు జీలకర్రను నీటిలో వేసి బాగా మరిగించి కషాయంలా చేసుకుని జీలకర్ర నీటిని రోజూ తాగాలి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. అధిక కొవ్వును కరిగిస్తుంది.
3. మెంతులు…మెంతులు ఆకలిని తగ్గిస్తాయి. బరువు తగ్గేందుకు సహాయ పడుతాయి. రాత్రి పూట గుప్పెడు మెంతులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి మెంతులను తినాలి. ప్రతి రోజూ పరగడుపునే ఇలా చేస్తే చాలా త్వరగా కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు.
4. దాల్చిన చెక్క…మెటబాలిజాన్ని పెంచే గుణాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి. దాల్చిన చెక్క పొడిని వేడి నీటిలో కలిపి తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో దాల్చిన చెక్క అమోఘంగా పనిచేస్తుంది.
లేత కోడి మాంసం, చేపలు, నట్స్, గుడ్లు, కొవ్వు తక్కువగా ఉండే కాటేజ్ చీజ్, గ్రీక్ యోగర్ట్, షియా విత్తనాలు, పప్పుధాన్యాలు, క్వినోవా తీసుకోవాలి. బ్రెడ్స్‌కు బదులుగా ఈ తరహా లీన్ ప్రొటీన్‌కు అలవాటు పడితే, పొట్ట దగ్గరి కొవ్వు తగ్గి, సన్నబడతాం.
Corona Vaccine: అమెరికా కీలక నిర్ణయం.. 6 నెలల పసికందులకు కరోనా టీకా