మనిషి శరీరం చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకుంటుంది. ఏ వ్యాయామంతో కూడా పోల్చి చూసినప్పటికీ కూడా యోగాలో ఉన్న చాలా విశిష్టతలు యోగాని చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. యోగకు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కేవలం శరీరం పై మాత్రమే ప్రభావం చూపించదు. శరీరంతో పాటు మెదడు మరియు ఆత్మ ఇలా అన్నింటిని వృద్ధి చేయడంలో యోగ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే బాగా ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ కుతూహులంగా వ్యవహరిస్తారో, అటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు యోగ వైపే చూస్తున్నారు. అందుకు కారణం ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు నరాల లోపల ఏదైనా అడ్డుపడితే వాటిని తొలగిస్తుంది. క్రమం తప్పకుండా యోగ చేయడం ద్వారా వృద్యాప్యంలో వచ్చే బోలు ఎముకల వ్యాధి మరియు కీళ్ల నొప్పులకు దూరంగా ఉంచుతుంది.
1. ఎముకలను దృఢంగా ఉంచుతుంది: ఎముకల్లో ఉండే క్యాల్షియం వయస్సు పెరిగే కొద్దీ తరుగుతూ ఉంటుంది. దీని ఫలితంగా ఎముకలు బలహీనం అయిపోతాయి. ఈ పరిస్థితుల్లో బోలు ఎముకల వ్యాధి సోకె అవకాశం ఉంది. ఇందువల్ల ఎముకలు ఇరగటం మరియు ఇతర ఎముకలకు సంబంధించిన సమస్యలు గాని, రోగాలు కానీ దరిచేరవట. ఇది ఒకసారి ప్రయత్నించండి : యోధుడి ఆసనం మరియు ప్రక్క కోన ఆసనాలు చేయడం ద్వారా మీ యొక్క ఎముకలు శక్తివంతం అవుతాయని చెబుతున్నారు.
2. రోగ నిరోధక శక్తి పెరగటానికి ఉపయోగపడుతుంది : యోగా లోని కొన్ని రకాల వ్యాయామాలు మరియు ఆసనాలు చేయడం ద్వారా శరీరంలో శోషరస ద్రవాలు పెరుగుతాయట. వీటిల్లో రోగనిరోధక కణాలు అధిక సంఖ్యలో ఉంటాయట. అందువల్ల మన శరీరం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధులతో సమర్ధవంతంగా పోరాడి మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుందట.
3. అధికంగా ఆహారం తినానే కోరికను అడ్డుకట్ట వేస్తుంది : శరీరానికి మరియు మెదడుకు మధ్య ఉన్న బంధాన్ని దృఢంగా ఉంచడానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం ద్వారా మనం ఏమి తింటున్నాం, ఎంత తింటున్నాం అనే విషయం మనకు స్పష్టంగా అర్ధం అవుతుంది. మనల్ని మాములు స్థితికి తీసుకురావడానికి మరియు ఒత్తిడిని దూరం చేయడానికి యోగ సమర్ధవంతంగా సాయపడుతుంది.
4. నిద్రలేమిని తరిమికొడుతుంది : మనం ఎక్కు నిద్రపోయే విధానాలపై యోగ సానుకూల ప్రభావం చూపిస్తుంది. వారానికి రెండు సార్లు యోగ చేసిన కూడా, అది మన మెదడుకి ఎంతో స్వాంతనను చేకూరుస్తుంది మరియు ఒత్తిడిలన్నింటిని దూరం చేస్తుంది.
5. రక్తపోటుని తగ్గింస్తుంది : క్రమం తప్పకుండా యోగ చేయడం ద్వారా శరీరం అంతటా కూడా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇందువల్ల ప్రాణవాయువు కలిగిన రక్తం శరీరంలో అన్ని అవయవాలకు బాగా అందుతుంది. రక్తపోటు అనేది తగ్గుతుంది. ఒత్తిడి వల్ల కలిగే రక్తపోటుని కూడా యోగ తగ్గిస్తుంది.
6. జీవక్రియను పెంచడం: మనం తీసుకొనే ఆహారం సరైన పద్దతిలో జీర్ణం అవ్వాలి. సరిగ్గా జీర్ణం అవ్వకపోతే, పొట్టకు సంబంధించిన సమస్యలెన్నో తలెత్తుతాయి మరియు బరువు కూడా పెరిగిపోతాము. మన పొట్ట ఎన్నో రకాల జీర్ణ క్రియకు సంబంధించిన ద్రవాలను ఉత్పత్తి చేయించడంలో యోగ ఎంతగానో సహాయపడుతుంది మరియు ఆహారం సరైన పద్దతిలో జీర్ణం అవ్వడానికి కూడా యోగ ఉపయోగపడుతుంది.
7. గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది : యోగా శరీరంలో ఉన్న కండరాళ్లనే కాకుండా గుండె సంబంధిత కండరాలను కూడా శక్తివంతం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. యోగా వల్ల గుండె సరైన పద్దతిలో కొట్టుకోవడమే కాకుండా, రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది మరియు గుండె పోటు వచ్చే అవకాశాల్ని తగ్గిస్తుంది. పాదాంగుష్టసన లేదా పెద్ద బ్రొటని వ్రేలు భంగిమ మరియు జానూ శిరసాసన, ఇవి చేయడం వల్ల గుండెను ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు.
8. శరీరంలోని అంతస్రావ విధులను మెరుగుపరచడం: శరీరంలో ఉన్న హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడానికి యోగ ఎంతగానో సహాయపడుతుంది. మన శరీరం సరైన పద్దతిలో పనిచేయాలంటే అందుకు ఖచ్చితత్వం తో కూడిన హార్మోన్ల ఉత్పత్తి జరగటం చాలా ముఖ్యం. హార్మన్ల అసమతుల్యత చోటుచేసుకోకుండా ఉండటాన్ని యోగ నియంత్రిస్తుంది మరియు సరైన పద్దతిలో పనిచేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. బద్ధ కోణాసన ను సాధారణంగా సీతాకోక చిలుక భంగిమ అని కూడా పిలుస్తుంటారు మరియు విపరీత కరణి, వీటిని చేయడం వల్ల అంతస్రావ ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటుంది.
9. రక్తంలో ఉన్న ట్రై గ్లిజరాయిడ్స్ సంఖ్యను తగ్గిస్తుంది : రక్తంలో ఉన్న కొవ్వుని ట్రై గ్లిజరాయిడ్స్ అని పిలుస్తారు. ఇవి గనుక ఎక్కువగా ఉన్నట్లయితే దానిని అనారోగ్య రక్తం అని కూడా అంటారు. ఈ పరిస్థితుల్లో రక్తనాళాలు గట్టి పడిపోయే అవకాశం కూడా ఉంది. దీని ఫలితంగా శరీరంలో రక్త ప్రసరణ తగ్గిపోయే అవకాశం ఉంది. చివరికి ఇది గుండె పోటు మరియు గుండె సంబంధిత వ్యాధులు అధికంగా వచ్చే విపరీత పరిణామాలకు దారితీయవచ్చు. యోగ చేయడం వల్ల ఈ ట్రై గ్లిజరాయిడ్స్ అనేవి నాశనం అవుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు గుండె ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది ఒకసారి ప్రయత్నించండి : కపాల్ భక్తి ప్రయాణం మరియు సర్వాంగాసనను నిర్దిష్టమైన ప్రదేశాల్లో చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో కొవ్వు శాతం బాగా తగ్గుతుంది.
10. మతిమరుపు వ్యాధిని పై పోరాటం: మెదడు యొక్క సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో మరియు దాని యొక్క పనితీరు పెంచడానికి యోగ ఎంతగానో సహాయపడుతుంది. యోగా వల్ల మతిమరుపు వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని అధ్యయనాలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మతి మెరుపు వ్యాధికి ముగింపు పలకడం లో ఒక కొత్త అధ్యయనం ప్రారంభంఅయ్యిందని కూడా చెబుతున్నారు. బలాసన లేదా చిన్నపిల్లల భంగిమ మరియు విపరీత కరణి, మెదడు యొక్క పనితీరుని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
11. మలబద్దకాన్ని నయం చేయడం: జీర్ణ వ్యవస్థ మరియు విసర్జన వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి యోగాలోని కొన్ని ఆసనాలు ఎంతగానో సహాయపడతాయి. పేగుల పై యోగా ఒత్తిడిని పెంచుతుంది మరియు విసర్జన సులభంగా సక్రమంగా జరగటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
సరైన సమతుల్యతతో కూడిన ఆహారం శరీరం తీసుకొనేలా యోగ చేస్తుంది మరియు మలబద్దకం వ్యాధి చాలా కొకొద్ది సమయంలోనే నయం అవుతుంది. అందుకు మీరు చేయవలసిందల్లా యోగా క్రమం తప్పకుండా చేయడమే.