ఆహార అలవాట్లపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. చాలామంది రకరకాల డైట్లు ఫాలో అవుతుంటారు. ఇందుకోసం డబ్బులు ఖర్చు పెట్టడమేకాకుండా.. ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రతి రోజూ మనం తినే ఆహారంలో ఈ ఐదింటిని చేర్చుకోవడంతో రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలేంటో చూద్దామా..
పెరుగు
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ప్రోటీన్లు, గట్ బ్యాక్టీరియా పుష్కలంగా లభిస్తుంది. కాల్షియంతో పాటు విటమిన్ బీ2, విటమిన్ బీ12, పొటాషియం, మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపడటంలో సహాయపడతాయి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి.
పప్పు దినుసులు
మనం తరచూ తినే పప్పుల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫైబర్, ప్రోటీస్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా సహాయపడుతాయి. అలాగే కొత్త కణాలు పునరుత్పత్తి అవ్వడంలో సహకరిస్తాయి. పప్పు దినుసుల్లో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ ఈ, మెగ్నిషియం, ఐరన్, జింక్ కూడా లభిస్తాయి.
మిల్లెట్లు
మన తాత ముత్తాతలు ఒకప్పుడు ఎక్కువగా రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తినేవాళ్లు. అందుకే వారు చాలాకాలం ఆరోగ్యంగా జీవించారు. ఈ మిల్లెట్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు కేన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్లు తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునేవారికి ఇది మంచి ఆహారం.
మసాలా దినుసులు
మన వంట్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. చూసారుగా.. మీరు కూడా ఈఐదు పదార్థాలను ఆహారంలో ఉపయోగించుకుని మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం.
Telangana: ప్రైవేటు ప్రాక్టీస్ రద్దుపై డాక్టర్లు ఫైర్