నూడుల్స్ .. ఈ పేరు వినగానే నోరూరుతుంది కదా. నూడుల్స్ అంటే ఇష్టపడని వారు ఈ రోజుల్లో ఉండరు. యువతలో నూడుల్స్‌కు క్రేజ్ చాలా ఎక్కువ. కొంతమంది వీటిని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటి ముఖ్యమైన భోజనసమయాల్లో తింటుంటారు. శరీర క్రియలు సక్రమంగా సాగడానికి ఆ మూడు భోజన సమయాల్లో తినే ఆహారం చాలా ప్రభావం చూపిస్తుంది. అలాంటి సమయాల్లో జంక్ ఫుడ్ అయిన నూడుల్స్ తినడం సరైన పద్ధతి కాదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.…
ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. కొందరికి జుట్టు రాలడం వల్ల త్వరగా బట్టతల కూడా వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, నిద్రలేమి జుట్టుకు పోషకాలు అందకపోవడం. జుట్టు రాలడం అనేది పురుషులకే కాదు, స్త్రీలకు కూడా సమస్య. కానీ ఈ సమస్య మగవారిలో ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది పురుషులు దీని వల్ల డిప్రెషన్ కు లోనవుతున్నారు. అందాన్ని పెంచడంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ…
రోజంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి కాసేపు కూర్చోగానే చాలా మందికి ఒంటినొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. కనీసం హాయిగా పడుకుందామనుకున్నా కుదరదు. దీంతో చాలా మంది పెయిన్ కిల్లర్స్ తీసుకుని నిద్రపోతుంటారు. ఒళ్లు నొప్పులతో పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం శరీరానికి చాలా ప్రమాదకరం. అందుకే ఈ ఒంటినొప్పులు తగ్గించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అవేంటో చూసేద్దామా మరి.. ఇక చాలామందిలో భుజం నొప్పి చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాని అసలు…
మారుతున్న కాలానికి అనుగుణంగా వాతారణంలో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి. గాలి కాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఇలాంటి వాతావరణంలో మానవాళికి అనేక వ్యాధులు, జబ్బులు రావడం సహజమే. అయితే ప్రధానంగా సీజనల్ జబ్బులు చాలా ఇబ్బందులు పెడుతాయి. మన ఆహారపు అలవాట్లు మారడంతో పాటు శారీరక శ్రమ కూడా తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ,శీతాకాలంలో మాత్రం గొంతునొప్పి సమస్య తీవ్రంగా…
మనం ఈ లోకాన్ని చక్కగా చూడాలంటే మనకు మంచి కళ్ళు అవసరం. సర్వేంద్రియానాం నయనం ప్రదానం అంటారు అందుకే. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న వేళ కంప్యూటర్ల వాడకం బాగా పెరిగిపోయింది. రోజుకి 7 నుంచి 8 గంటల పాటు మనం డెస్క్ టాప్, ట్యాబ్ ల ముందు కూర్చుంటాం. అంతకంటే ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తుంటాం. అయితే, ఎక్కడ పనిచేస్తున్నా.. కంటిని సంరక్షించుకోవడం అత్యవసరం. * కంప్యూటర్ మీద పనిచేస్తున్నప్పుడు కళ్లు త్వరగా అలసిపోతుంటాయి.…
నేటి కాలంలో గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. చిన్నగా కనిపించినా చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రజెంట్ అందరికీ ఉండే కామన్ ప్రాబ్లమ్ ఏంట్రా అంటే అది గ్యాస్ అనే చెప్పాలి.. ఏజ్ తో సంబంధం లేకుండా అందరికి వస్తుంది. టైంకు భోజనం చేయకకోవటం, తీవ్రమైన మానసికి ఒత్తిడి, సరిగా నిద్రలేకపోవటం, ఎక్కువ ఆలోచనలు ఇవన్నీ మితిమీరి గ్యాస్ ట్రబుల్ కి దారితీస్తున్నాయి. జాబ్స్ చేసే వాళ్లకు దాదాపు ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి. ఈ…
మాములుగా మన రోజు వారి జీవితంలో ఉప్పు అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది కదా! అందుకే ఇది షడ్రుచుల్లో ఒకటి. కానీ మీకు ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే ఉప్పును రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందట. అదేంటి మేము రోజు, కూరలలో తీసుకుంటున్నాం కదా అనకండి. మీరు తీసుకోవాల్సింది.. నీటిలో ఉప్పు కలుపుకొని తాగడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయని…
వేసవికాలం వచ్చిందంటే చాలు.. మామిడి పండ్ల హంగామా మొదలైపోతుంది. రాక రాక ఏడాదికి ఒకసారే మార్కెట్లోకి వస్తాయి కాబట్టి, మామిడి ప్రియులు వీటిని కొనుగోలు చేసేందుకు ఎగబడతారు. అంత, ఇంత అని మోతాదు చూసుకోకుండా.. ఎక్కువ స్థాయిలో తినేస్తారు. మరి, ఇలా విరగబడి తినడం కరెక్టేనా? ఆరోగ్యానికి మంచిదేనా? అంటే.. అవుననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎన్ని ఎక్కువ తిన్నా, వీటి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని చెప్తున్నారు. ఈ పండ్లలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో పౌషకాలు…
పొట్ట.. ఈమధ్య కాలంలో చాలామందిని బాధిస్తోన్న అతిపెద్ద సమస్య ఇది! ఇంట్లో తినడం, ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, తిరిగి ఇంటికి వెళ్ళగానే బెడ్‌పై పడిపోవడం.. ఇవే అందరి జీవితాల్లో రోజువారి దినచర్యలు అయిపోయాయి. శారీరక శ్రమ అన్నది ఏమాత్రం లేదు. దీనికితోడు జంక్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయారు. పిజ్జాలు, బర్గర్స్తో పాటు విచిత్రమైన ఆహారాల్ని తీసుకుంటున్నారు. తద్వారా పొట్టలో కొవ్వు బాగా పేరుకుపోతోంది. దీంతో పొట్టలు బస్తాలుగా మారిపోతున్నాయి. మన శరీరంలో ఒక…
ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. కొందరికీ చక్కెరతో చేసిన టీ, కాఫీ, ఇతర స్వీట్ డ్రింక్స్ తాగాలంటే ఇష్టం. మరికొందరు బెల్లంతో చేసిన పానీయాల్ని ఎంతో ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా.. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేవాళ్ళు చక్కెరను దూరం పెడుతంటారు. వీరితో పాటు షుగర్ వ్యాధిగ్రస్తులు సైతం.. చక్కెరను పక్కన పెట్టేసి, ఇతర ఆరోగ్యకరమైన స్వీట్నర్లను వాడుతారు. ఆ స్వీట్నర్లలో ప్రధానంగా బెల్లంనే ఎంపిక చేసుకుంటారు. ఇందులో పొటాషియం, ఐరన్, పాస్ఫరస్, మెగ్నీషియం, ఇంకా ఇతర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.…