Sanju Samson: గురువుకు తగ్గ శిష్యుడు.. గంభీర్ ఆటను గుర్తు చేసిన సంజూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ 2026లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజూ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులతో అజేయంగా రాణించాడు. ఒత్తిడిలోనూ చాలా కూల్ గా ఆడుతూ జట్టును విజయపథం వైపు నడిపించాడు. సంజూ శాంసన్ ఆడిన అజేయ 97 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టుకు సెమీఫైనల్ టికెట్ మాత్రమే కాదు.. అతనిపై ఉన్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు.
Sanju Samson: 3 పరుగులతో సెంచరీ మిస్, మీరు నిరాశ పడ్డారా?.. సంజు షాకింగ్ ఆన్సర్!
Also Read
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
2020 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సంజూ బాగా ఆడినప్పుడు గౌతమ్ గంభీర్ అతడిని భారత్ లో అత్యుత్తమ యువ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ గా అభివర్ణించాడు. ముఖ్యంగా “సంజూ భారత్ తరఫున ఆడకపోతే అది సంజూకి కాదు.. దేశానికే నష్టం” అని అప్పట్లో గంభీర్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలా నిరంతర అవకాశాలు ఇస్తే ప్రపంచ స్థాయి బ్యాటర్‌గా ఎదుగుతాడని కోచ్ గంభీర్ అప్పట్లోనే విశ్వాసం వ్యక్తం చేశారు.
అప్పట్లో జట్టులో స్థానం దక్కకపోవడం, స్థిరత్వం లేకపోవడం వంటి అంశాలపై చర్చలు జరిగినా గంభీర్ మాత్రం సంజూ ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంచాడు. ఇప్పుడు అదే గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉండగా.. సంజూ కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్ ను ఆడాడు. టోర్నమెంట్ ఆరంభంలో సంజూను జట్టులోంచి తప్పించాలని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఫామ్ లో లేడని విమర్శలు భారీగా వచ్చాయి.
అయితే ఈ విషయాలపై తాజగా గంభీర్ స్పందిస్తూ.. “సంజూలో ఎంత సామర్థ్యం ఉందో మాకు తెలుసు. అతని ఖాతాలో మూడు టీ20 సెంచరీలు ఉన్నాయి. ప్రతి ఆటగాడికి “బ్యాడ్ టైం” వస్తుంది. అప్పుడు అతడికి మద్దతు అవసరం” అని అన్నారు. ఇది ఇలా ఉంటే.. సంజూ శతకానికి కేవలం మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా గుర్తు ఉండిపోనుంది. అయితే కొందరు ఈ ఇన్నింగ్స్ ను 2011 వరల్డ్ కప్ ఫైనల్ లో గంభీర్ చేసిన 97 పరుగుల ఇన్నింగ్స్ ను గుర్తుచేసుకున్నారు. ఆ రోజు గంభీర్ కూడా కరెక్ట్ గా 97 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆయన శిష్యుడైన సంజూ కూడా అదే స్కోరుతో జట్టును గెలుపు దిశగా నడిపించడం అభిమానులను ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!