Mana Shankar Varaprasad Garu: 109 సెంటర్లలో 50 రోజులు.. సరికొత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ‘మెగా’ రికార్డులరో మళ్ళీ కళకళలాడుతోంది, మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ రికార్డుల వేటను కొనసాగిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం వసూళ్లలోనే కాకుండా, థియేట్రికల్ రన్‌లోనూ తన సత్తా చాటుతూ నేటితో 109 కేంద్రాల్లో 50 రోజుల ప్రదర్శనను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది, నేటి కాలంలో సినిమాలు విడుదలైన రెండు వారాలకే ఓటిటి బాట పడుతున్న తరుణంలో, ‘మన శంకరవరప్రసాద్ గారు’ సాధించిన ఈ 50 రోజుల మైలురాయి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అటు మెగాస్టార్ కెరీర్‌లోనూ, ఇటు అనిల్ రావిపూడి కెరీర్‌లోనూ ఇది మొదటి 400 కోట్ల క్లబ్ చిత్రంగా నిలిచింది, ఉత్తర అమెరికా మార్కెట్లో ఏకంగా 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి, మెగాస్టార్ గ్లోబల్ క్రేజ్‌ను మరోసారి నిరూపించింది.
Also Read:Nikhil : నిఖిల్ ‘స్వయంభు’.. భారీ ధరకు సీడెడ్ రైట్స్.. డీల్ క్లోజ్
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
బుక్ మై షో ప్లాట్‌ఫారమ్‌లో 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం ఒక ప్రాంతీయ చిత్రానికి అరుదైన గౌరవంగా టీం చెబుతోంది, జీ5 (ZEE5) వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైనప్పటికీ, థియేటర్లలో ఈ సినిమాకు ఆదరణ తగ్గకపోవడం విశేషం. జీ5 లో కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా అవతరించింది, ఈ భారీ విజయానికి ప్రధాన కారణం చిరంజీవి గారిలోని ‘వింటేజ్’ లుక్ అండ్ ఆయన ఎనర్జీ. ఆయన కామెడీ టైమింగ్, చురుకైన నటన ప్రేక్షకులను పాత రోజుల్లోకి తీసుకెళ్లాయి, అనిల్ రావిపూడి తనదైన శైలిలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా దీనిని తీర్చిదిద్దారు. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెరవగా, నయనతార తనదైన గాంభీర్యంతో సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చారు, షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫేవరెట్ ఛాయిస్‌గా నిలిచింది. మొత్తానికి, ‘మన శంకరవరప్రసాద్ గారు’ 109 కేంద్రాల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
-
Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!