స్నానం అనేది శరీర పరిశుభ్రతను కాపాడేందుకు చేసే ఓ అలవాటు. చాలామంది ప్రతిరోజు స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా సంభవిస్తాయి. ముఖ్యంగా చర్మం, జుట్టు, రోగనిరోధక శక్తిపై దీని ప్రభావం కనిపించొచ్చు. మరి రోజూ స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం. చర్మం పొడిబారడం: తరచూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ తేమ…
రేపే రంగుల పండుగ హోలీ. ఈ పండుగను ఆనందంగా జరుపుకొనేందుకు చిన్నారులు, యువతీయువకులు, పెద్దలు సిద్ధమయ్యారు. అయితే రంగుల విషయంలో జాగ్రత్తలు పాటించక పోతే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి పూర్వం సహజ సిద్ధ రంగులైన.. హెన్నా, పసుపు, కుంకుమ, చందనం, బుక్క గులాలు, మో దుగ పూలతో తయారు చేసిన రంగులు, టమాట గింజలతో తయారు చేసిన పొడిని పూసుకునే వారు. వీటి వల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
నేటి రోజుల్లో ప్రజలంతా ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రకరకాల వ్యాయామాలు చేస్తు్న్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. పోషకాహారానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి మీరు కూడా ఆరోగ్యం కోసం ఏం ఫుడ్ తినాలని ఆలోచిస్తున్నారా? అయితే ఉదయం వేళ ఖాళీ కడుపుతో ఈ గింజలను తింటే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. గింజల్లో ప్రోటీన్, నికోటిన్ ఆమ్లం, థయామిన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, ఖనిజాలు, ఇనుము, పొటాషియం అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. Also Read:Indian…
Obesity Causes: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఊబకాయం (Obesity) ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి, అనారోగ్యకరమైన అలవాట్లు ఇవన్నీ బరువు పెరగడానికి ప్రధాన కారణాలు. ఊబకాయం మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కీళ్ల సమస్యలు వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 4న “ప్రపంచ ఊబకాయ…
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసాలు (రోజా) ప్రారంభించారు. ఇక రంజాన్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీం. ముందుగా ఈ హలీం ను ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఇరాన్ దేశంలో ప్రారంభించారు. ఇది క్రమంగా ఇరాన్ దేశం నుంచి నేడు భారతదేశానికి పాకింది. దీంతో ఇప్పుడు మారుమూల గ్రామాల్లో సైతం హలీం వ్యాపించి హిందూ, ముస్లింలను తన వద్దకు రప్పించుకుంటుంది చెప్పాలంటే ముస్లిం సోదరుల కంటే కూడా…
Chicken – Mutton: మాంసాహార ప్రియులు చికెన్, మటన్ను ఎంత ఇష్టంగా తింటారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బిర్యానీ, బాగారా రైస్, ఫ్రైలు లాంటి వంటకాలను చూడగానే నోరూరిపోతుంది. అయితే, మాంసాహారం తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి అనేక హానికరమైన ప్రభావాలు కలగవచ్చు. చాలా మంది అనుకోకుండా ఈ పదార్థాలను తింటూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా చికెన్, మటన్ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను మిశ్రమంగా తినడం…
మొబైల్, ల్యాప్టాప్ లేదా టీవీ, ఇవి మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. అవి లేకుండా మనం ఆఫీసులో పనిచేయలేం. పడుకోము, తినము. పెద్దవారిలోనే కాదు పిల్లల్లో కూడా స్క్రీన్ అడిక్షన్ బాగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు తమ పని తాము చేసుకునేందుకు చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. పిల్లలు క్రమంగా దానికి బానిసలవుతున్నారు. పిల్లవాడు మొబైల్ చూడకుండా తిండి తినడు. మొబైల్ ని ముందు పెట్టుకుని తినే పిల్లలను మీరు కూడా చాలా మంది చూసి ఉంటారు.…
దేశ రాజధాని దిల్లీ తరహాలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం పెరుగుతోంది. దుమ్మూ, ధూళి, వాహనాల పొగ.. గాలిలో కలవడం లేదు. పైపైనే ఒక పొరలా పేరుకుపోతోంది. దీంతో గాల్లో కాలుష్యం పెరిగి.. వాయు నాణ్యత తగ్గుతోంది. దీంతో గాల్లో నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి ఎక్కువగా కలుషితమవుతోంది. ఈ వాయు కాలుష్యం ధాటికి ఊపిరితిత్తులు విలవిలలాడుతున్నాయి.
టీవీ చూస్తూ అన్నం తినడం అలవాటుగా మారిపోయింది. తినేటప్పుడు టీవీ చూడొద్దని పెద్దలు చెబుతుంటారు. కానీ వాళ్ల మాటలు ఎవ్వరూ పట్టించుకోరు. పిల్లలకు తల్లిదండ్రులే ఫోన్, టీవీలు చూస్తూ తినిపిస్తుంటారు. ఇది వాళ్లకు అస్సలు మంచిది కాదు. టీవీ లేదా ఫోన్ చూస్తూ భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తినే పటప్పుడు ఫోన్, టీవీ చూస్తే.. స్థూలకాయానికి గురయ్యే ప్రమాదం ఉందట.
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కోట్లు కుమ్మరించినా తిరిగి ఆరోగ్యాన్ని పొందుతారనే గ్యారంటీ లేదు. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు మోషన్ కి వెళ్లే విధానాన్ని బట్టి చెప్పొచ్చు. అంటే మీ గట్ హెల్తీగా ఉంటే.. మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే. గట్ ఆరోగ్యంపైనే శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. అలాంటి హెల్తీ గట్ మీ సొంతం కావాలి అంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు…