Health Tips: మనలో చాలామంది ప్రతిరోజూ అల్పాహారంగా ఇడ్లీలు, దోసెలు ఇంకా అనేకరకాల ఆయిల్ ఫుడ్ తినడాన్ని అలవాటు చేసుకున్నాం. అయితే ఇవన్నీ తినకుండా ఒక సింపుల్ టెక్నిక్ పాటిస్తూ ఆరోగ్యానికి చాలా మేలు చేసే చద్దన్నం తయారు చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విధానం మన పేగులకు, జీర్ణక్రియకు మాత్రమే కాకుండా అల్సరేటివ్ సమస్యలు ఉన్న వారికి ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది.
డాల్బీ విజన్, గూగుల్ అసిస్టెంట్ లతో వచ్చేసిన AKAI PowerView సిరీస్ టీవీలు!
మొదటగా సాయంత్రం 4 గంటల సమయంలో అన్నం వండి పెట్టాలి. ఆ అన్నంలో పాలు కలిపి, అందులో కాస్త పెరుగు వేసి ఉంచాలి. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ఆ పెరుగు అన్నం బాగా పులుసిపోతుంది. ఈవెనింగ్ సమయంలోనే పెరుగు వేసినందువల్ల రాత్రంతా ఎక్కువ సమయం గడుస్తుంది కాబట్టి అది సహజంగా పులుసి, లైట్‌గా చద్దన్నంలా తయారవుతుంది.
Baahubali The Epic : కీలక సన్నివేశాలు లేపేసిన జక్కన్న.. ఇది నీకు న్యాయమా..
ఇది తినేటప్పుడు కొంచెం జీలకర్ర పొడి, చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు కలిపి తింటే రుచి మరింతగా పెరుగుతుంది. ఈ పుల్ల పెరుగన్నంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ముఖ్యంగా లాక్టోబాసిల్లస్, ఆసిడోఫిలస్ వంటి మంచి బాక్టీరియా పెరుగుతాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతూ జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ప్రేగులలో పుళ్లు, అల్సరేటివ్ సమస్యల వల్ల రక్తస్రావం లేదా తరచుగా మల సమస్యలు ఎదుర్కొనే వారికి ఈ సద్దన్నం ప్రత్యేకంగా మేలు చేస్తుంది. రక్తస్రావాన్ని తగ్గించి, మల ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.