Papaya Side Effects: ఈ 5 సమస్యలున్నవారు బొప్పాయి తినకూడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీజన్‌తో సంబంధం లేకుండా లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. పసుపు రంగులో నిగనిగలాడుతూ తియ్యని రుచితో లభించే ఈ బొప్పాయిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి ఇవి మన శరీరానికి మేలు చేస్తాయి. అయితే ఇన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసే బొప్పాయి అందరికీ ఇది సూటవదు. కొందరికి ఇది సమస్యలు తెస్తుంది. ముఖ్యంగా ఈ 5 పరిస్థితుల్లో ఉన్నవారు బొప్పాయి తినకుండా జాగ్రత్త పడాలి.
1. గర్భిణీ స్త్రీలు
గర్భధారణ(Pregnancy) సమయంలో పండని లేదా సగం పండిన బొప్పాయి తినకూడదు. ఇందులో అధిక మొత్తంలో లేటెక్స్, పపైన్ ఉంటాయి. కనుక ఇది గర్భాశయంలో సంకోచాలకు కారణమవుతాయి. ఇది అకాల ప్రసవానికి లేదా ఇతర సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల.. వైద్యులు సాధారణంగా గర్భిణీ స్త్రీలు బొప్పాయిని పూర్తిగా తినకుండా ఉండాదని చేబుతారు. బొప్పాయిలో కొన్ని సహజ సమ్మేళనాలు కనిపిస్తాయి.
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
2. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు
బొప్పాయిలోని లైకోపిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది రక్తనాళాలలో తగిన రక్షణను కల్పిస్తూ, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే, బొప్పాయిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. నిత్యంగా బొప్పాయి తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, హృదయ సంబంధిత సమస్యల నుంచి రక్షణ పొందడం సులభం అవుతుంది.
3. లేటెక్స్ అలర్జీ ఉన్నవారు
బొప్పాయిలో ఉండే కొన్ని ప్రొటీన్లు లేటెక్స్ ప్రోటీన్లకు సమీపంగా ఉంటాయి. అందువల్ల అలర్జీ ఉన్న వ్యక్తులు బొప్పాయి తింటే, దురద (అలర్జిక్ రియాక్షన్), తుమ్ములు,శ్వాస సమస్యలు లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొనవచ్చు. డాక్టర్ సలహా మేరకు మాత్రమే తినాలి.
4. థైరాయిడ్ సమస్యలున్నవారు
బొప్పాయిలో కొన్ని సహజ రసాయనాలు, ముఖ్యంగా ఫైటోకెమికల్స్, థైరాయిడ్ హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపవచ్చు. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులకి పెద్ద ప్రభావం ఉండదు. కానీ థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు బొప్పాయిని అధికంగా తీసుకోవడానికి ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
5. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు
బొప్పాయి ఒక సహజ ఫలంగా చాలా విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ C మరియు రకరకాల మినరల్స్‌కి ప్రసిద్ధి చెందింది. విటమిన్ C శరీరంలో ఇమ్యూనిటీ పెంచడంలో, చర్మం, కళ్ల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. కానీ, కిడ్నీ రాళ్ల సమస్యలు ఉన్నవారికి బొప్పాయి కొద్దిగా ప్రమాదకరమయినది. విటమిన్ C అధికంగా తీసుకుంటే శరీరంలో ఆక్సలేట్ పదార్థాలు పెరుగుతాయి. ఈ ఆక్సలేట్లు శరీరంలో కాల్షియం తో కలిసినప్పుడు కిడ్నీలో రాళ్లు గా మారే అవకాశం ఉంది. కాబట్టి, ఇప్పటికే కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవాళ్లు, కిడ్నీ ఫంక్షన్ స్లోగా ఉన్నవారు లేదా కాల్షియం-ఆక్సలేట్ రాళ్లకు రిస్క్ ఉన్నవారికి బొప్పాయి ఎక్కువగా తినడం హానికరం కావచ్చు. చిన్న ముక్కలుగా, రోజుకు ఒక్కసారి మాత్రమే తినడం మంచిది. తిన తర్వాత ఎక్కువ నీరు త్రాగడం, కిడ్నీ ద్వారా ఆక్సలేట్ లను బయటకు తేల్చడంలో సహాయపడుతుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు