ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పేరు అటు సోషల్ మీడియాలో, ఇటు టీవీల్లో మార్మోగిన విషయం తెలిసిందే. ఉచిత టిక్కెట్ల కోసం హెచ్‌సీఏ తమను దారుణంగా హింసిస్తోందని, వేధింపులు ఇలానే కొనసాగితే హైదరాబాద్ నగరాన్ని ఫ్రాంఛైజీ వీడిపోవడానికి సిద్ధంగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఓ లేఖ రాసినట్లు న్యూస్ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై హెచ్‌సీఏ అధికార ప్రకటన విడుదల చేసింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ‘ఎస్‌ఆర్‌హెచ్‌యాజమాన్యం…
నిత్యం వివాదాల్లో నిలిచే హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మరోసారి వార్తల్లో నిలిచింది. ఉచిత టిక్కెట్ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్ మోహన్ రావు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)ను బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేస్తుండడంతో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంఛైజీ హైదరాబాద్ నగరాన్ని వీడిపోతామని హెచ్చరించింది. ఐపీఎల్ 2025 సందర్భంగా కోరినన్ని ఫ్రీ పాస్‌లు ఇవ్వనందుకు ఓ మ్యాచ్‌లో తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్‌కు తాళాలు వేసినట్లు సన్‌రైజర్స్ ప్రతినిధి ఒకరు హెచ్‌సీఏ కోశాధికారికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మ్యాచ్‌లు మార్చి 22 నుంచి ఆరంభం కానున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకొని ముమ్మర సాధన చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఐపీఎల్ కోసం ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు తీసుకొస్తోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని రూ.5…
అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో యువ కెరటం తెలుగమ్మయి గొంగిడి త్రిష దేశ ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పింది. అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసింది.32 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ సత్తా చాటి మూడు వికెట్లను ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది గొంగిడి త్రిష. మేము…
అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 భారత్ గెలుచుకున్నవిషయం తెలిసిందే. భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన భీకర పోరులో భారత జట్టు విజయ దుందుభి మోగించింది. బ్యాటిగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో తెలుగు తేజం గొంగిడి త్రిష అసాధారణ ప్రతిభ కనబర్చింది. 32 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ సత్తా చాటి మూడు వికెట్లను…
ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, హైదరాబాద్ యువ అథ్లెట్ అగసర నందినికి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సన్మానం చేశారు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణకు తరఫున బరిలోకి దిగుతున్న నందినికి లక్ష రూపాయల చెక్‌ను నగదు ప్రోత్సాహకంగా అందించారు జగన్మోహన్ రావు.
ఇటీవల తమిళనాడులో జరిగిన ఆల్ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో.. హైదరాబాద్ క్రికెట్ జట్టుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శినపల్లి జగన్‌మోహన్ రావు భారీ నజరానా ప్రకటించారు. ఏడేళ్ల తర్వాత టైటిల్ సాధించిన ఆటగాళ్లకు రూ. 25 లక్షల నగదు బహుమతి అందజేస్తున్నట్టు జగన్‌మోహన్ రావు ప్రకటించారు.
ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుచ్చిబాబు టోర్నమెంట్ ని గెలుపొందిన హైదరాబాద్ క్రికెట్ టీంకి హెచ్ సిఎ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ టీం, చెన్నైలో జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన సందర్భంగా క్రికెట్ టీం కి 25లక్షల నగతు బహుమతిని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ప్రకటించారు. హెచ్‌సీఏ టీమ్ కి హెడ్ ఆపరేషన్ గా ఉన్న మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ముఖ్య అతిథిగా…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తన అసోసియేషన్ చరిత్రలో తొలిసారిగా మహిళా క్రికెటర్ల కోసం ప్రారంభ మహిళల T10 లీగ్‌ను ప్రారంభించినట్లు దాని అధ్యక్షుడు అర్షనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మహిళా లీగ్ ప్రారంభోత్సవంలో జగన్మోహన్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో 15 రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో దాదాపు 450 మంది మహిళా క్రికెటర్లు ఆడనున్నట్లు జగన్ తెలిపారు. ప్రతి జట్టు ప్రేరణ కోసం ఉప్పల్ అంతర్జాతీయ…
HCA Pays Pending Power Bill to TSSPDCL: దాదాపు 10 ఏళ్లుగా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)తో నడుస్తున్న పవర్ బిల్ వివాదానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ముగింపు పలికింది. మంగళవారం రూ.1 కోటి 48 లక్షల 94 వేల 521ల మొత్తాన్ని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషా రఫ్ అలీ ఫరూఖీకి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు చెక్ రూపంలో అందించారు. దాంతో 2015లో మొదలైన విద్యుత్ బిల్…