హెచ్‌సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్ చేసిన కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ హైకోర్టుకు వెళ్లారు. టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్‌మాల్ చేశారనే ఆరోపణలు అజహరుద్దీన్‌పై ఉన్నాయి.
Mohammad Azharuddin: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారులపై అవినీతి కేసు నమోదైంది. వీరంతా అసోసియేషన్ సొమ్మును దుర్వినియోగం చేశారని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.
HCA Elections 2023 Results Out Today: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలు మొదలయ్యాయి. ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో హెచ్‌సీఏ ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్ జరగనుంది. ఇక సాయంత్రం 6 గంటలలోపు ఫలితాలు వెలువడే అవకాశముంది. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ పర్యవేక్షణలో జరుగుతున్న హెచ్‌సీఏ ఎన్నికలకు అధికారులు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త…
HCA Announce Hyderabad Cricket Team for Syed Mushtaq Ali Trophy: టీమిండియా యువ క్రికెటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ బంపరాఫర్ కొట్టేశాడు. ఏకంగా కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. దేశవాళీ జాతీయ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును తిలక్ ముందుండి నడిపించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును తాజాగా హెచ్‌సీఏ అధికారులు ప్రకటించింది. హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా తిలక్ వర్మను ప్రకటించారు.…
ఇద్దరు క్రికెటర్లపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) నిషేధం వేటు వేసింది. అండర్-19 క్రికెటర్ మహ్మద్ బాబిల్లేల్, రిజిస్టర్డ్ ఆటగాడు శశాంక్ మెహ్రోత్రాలను ఐదేళ్ల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీమ్ సెలక్షన్ లో తప్పుడు పత్రాలు(నకిలీ వయస్సు సర్టిఫికెట్స్) ఇచ్చినట్లు హెచ్సీఏ నిర్ధారించింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కి చుక్కెదురు అయింది. హెచ్‌సీఏ ఓటరు జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగించింది. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేశారు.
BCCI Vice President Rajeev Shukla Gaves Clarity on Hyderabad hosting World Cup 2023 Matches: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు తాము సెక్యూరిటీ ఇవ్వలేమని నగర పోలీసు విభాగం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్-నెదర్లాండ్స్ మ్యాచ్ అక్టోబర్ 9న ఉండగా.. ఆ మరుసటి రోజే పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ ఉంది. వరుసగా రెండు రోజుల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తే.. సెక్యూరిటీపరంగా ఇబ్బందులు…
HCA Asks BCCI to Make Changes in ICC ODI World Cup 2023 Schedule: అక్టోబర్ 5 నుంచి భారత్ గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీ కోసం భారత్‌లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రపంచకప్ 2023 కోసం అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. కొన్ని టీమ్‌లు ఇప్పటికే తమ ప్రాథమిక జట్లనూ ప్రకటించాయి. ఫాన్స్ టిక్కెట్లు బుక్ చేసుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే టోర్నీ సమీపిస్తున్నా కొద్దీ..…
పలు అక్రమాలకు పాల్పడ్డ నేపథ్యంలో ఈ క్లాబ్స్ పై కమిటీ వేటు వేసింది. 80 క్లబ్బులను తమ అధీనంలో పెట్టుకున్న 12 మంది గుర్తించి.. ఆ 12 మందితో పాటు వారి కుటుంబ సభ్యులు హెచ్సీఏ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించారు. అందుకోసమే.. హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయా క్లబ్ల్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీలపై నిషేధం విధించింది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వద్ద మూడు రోజుల పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అండర్-16 బాయ్స్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని జిల్లాల నుంచి వందల మంది ఈ సెలక్షన్స్ కి హాజరు అయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్లేయర్స్ రావడంతో HCA వెనక్కి పంపించింది.