ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, హైదరాబాద్ యువ అథ్లెట్ అగసర నందినికి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సన్మానం చేశారు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణకు తరఫున బరిలోకి దిగుతున్న నందినికి లక్ష రూపాయల చెక్‌ను నగదు ప్రోత్సాహకంగా అందించారు జగన్మోహన్ రావు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో కూడా నందినికి అన్ని విధాలా అండగా ఉంటానని తెలిపారు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, అనేక కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్న నందినిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. నందిని వచ్చే ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని జగన్మోహన్ రావు ఆకాంక్షించారు.
Read Also: Women’s U19 T20 WC: U19 వరల్డ్ కప్ ఆఫ్ ది టోర్నమెంట్ లిస్టులో నలుగురు భారత ఆటగాళ్లు..
ఇదిలా ఉంటే.. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలంగాణ క్రీడాకారులకు చేయూతను అందిస్తున్నారు. పలువురు క్రీడాకారులకు ఆసరాను అందించారు. తాజాగా.. ఆర్చర్ చికితకు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు చేయూత అందించిన సంగతి తెలిసిందే.. అక్షర విద్యాసంస్థల నుంచి 10 లక్షల స్పోర్ట్స్ స్కాలర్‌షిప్ అందించారు. అంతకుముందు కూడా పలువురు క్రీడాకారులకు జగన్మోహన్ రావు సపోర్ట్ గా నిలిచారు.
Read Also: Trump-PM Modi: ట్రంప్-మోడీ భేటీ ఎప్పుడంటే..!