హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. తాజాగా ఈ అంశంపై అజారుద్దీన్ స్పందించారు. ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పేరు నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గతంలో మహిళా జట్టు విషయంలో, ఇప్పుడు ఐపీఎల్ 2025 టిక్కెట్ల విషయంలో హెచ్‌సీఏ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. తాజాగా మరోసారి హెచ్‌సీఏ పేరు తెరపైకి వచ్చింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం నార్త్ స్టాండ్ పేరు విషయంలో హెచ్‌సీఏ సమస్య ఎదుర్కొంటోంది. స్టేడియంలోని నార్త్ స్టాండ్ పేరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు…
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశించింది. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై అంబుడ్స్‌మన్ విచారణ చేపట్టారు..హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో తన పేరు పెట్టుకోవాలని అజార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో విచారణ చేపట్టి వెంటనే ఆ పేరును తొలగించారు.
తండ్రుల అధికారాన్ని అడ్డంపెట్టుకుని కొడుకులు అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఘటనలు ఇదివరకు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే రీతిలో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సునీల్ అగర్వాల్ కొడుకు హంగామా చేశాడు. ఉప్పల్ స్టేడియంలో సునీల్ కొడుకు ఖుష్ అగర్వాల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. క్రికెటర్‌లతో ఫొటోలు.. ఏకంగా తండ్రి చైర్‌లోనే కూర్చుని స్టేడియంలో సమావేశాలు.. గేట్ దగ్గర నుంచి వీఐపీ ట్రీట్‌మెంట్.. స్టేడియంలోని పలు ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ హల్ చల్ చేశాడు. Also…
అది ‘‘వక్ఫ్ బిల్లు’’ కాదు, ‘‘వక్ఫ్ విధ్వంస బిల్లు’’.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ బుధవారం పార్లమెంట్ ముందుకు రాబోతోంది. రేపు మధ్యాహ్నం బిల్లును ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే, ఎంపీలు అంతా సభకు హాజరుకావాలని ఎన్డీయే పార్టీలు తమ తమ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మరోవైపు, ఈ బిల్లును అడ్డుకునే దిశగా కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ వంటి ఇండీ కూటమి నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు.…
HCA-SRH : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) , సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య కొనసాగుతున్న వివాదానికి శుభం కార్డు పడింది. బీసీసీఐ, హెచ్‌సీఏ, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం మేరకు ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు ఎలాంటి ఆటంకం ఉండకూడదని హెచ్‌సీఏ స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ప్రధాన అంశాలు: కాంప్లిమెంటరీ పాసులు: పాత ఒప్పందం ప్రకారమే…
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మధ్య కాంప్లిమెంటరీ టిక్కెట్ల (ఉచిత పాస్‌లు) వివాదం జరుగుతోన్న విషయం తెలిసిందే. కాంప్లిమెంటరీ టిక్కెట్ల విషయంలో హెచ్‌సీఏ బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ చేస్తోందని.. ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్ వీడి మరో రాష్ట్రాన్ని హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకుంటామని ఎస్‌ఆర్‌హెచ్ స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం కోరింది. మరోవైపు ఈ వ్యవహారంపై…
‘రాజీవ్ యువ వికాసం’ పథకంపై మంత్రి కీలక వ్యాఖ్యలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ,మైనార్టీల,వెనుకబడిన తరగతుల, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కొరకు రాజీవ్ యువ వికాసం కార్యక్రమని, రాష్ట్రంలో ఉన్న యువతకు స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో…
SRH – HCA: హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంప్లిమెంటరీ పాస్‌లు కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియాన్ని వదిలిపెట్టే అవకాశం ఉందని కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి హెచ్‌సీఏకు ఒప్పందం ప్రకారం 10% ఉచిత టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది.…
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మధ్య కాంప్లిమెంటరీ టిక్కెట్ల (ఉచిత పాస్‌లు) వివాదం రోజురోజుకు ముదురుతోంది. హెచ్‌సీఏ బ్లాక్ మెయిలింగ్ విషయంలో జోక్యం చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఆదివారం కోరింది. వెంటనే ఈ వివాదంను పరిష్కారించాలని సన్‌రైజర్స్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. మరి ఈ వివాదం ఎక్కడివరకు దారితీస్తుందో చూడాలి. Also Read: Kalyan Shankar: కక్కుర్తి, స్వార్ధం.. ‘మ్యాడ్ స్క్వేర్’…