HCA President Jaganmohan Rao Scam: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. హెచ్‌సీఏ స్కామ్‌పై పూర్తి వివరాలు కావాలని తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ)ను ఈడీ కోరింది. హెచ్‌సీఏలో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. హవాలా, మనీ లాండరింగ్ రూపంలో లావాదేవీలు జరిగినట్టుగా ఈడీ అనుమానిస్తోంది. హెచ్‌సీఏ కమిటీ సభ్యులు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. బీసీసీఐ, ఐపీఎల్ ప్రాంచైజీ…
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులు 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులను మరింతగా విచారించాల్సిన అవసరం ఉందంటూ, తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) కస్టడీ పిటిషన్‌ను మల్కాజ్‌గిరి కోర్టులో దాఖలు చేసింది. సీఐడీ తమ పిటిషన్‌లో నిందితులను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. ఈ…
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై మల్కాజ్‌గిరి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కేసులో కీలకమైన రిమాండ్ రిపోర్ట్ ఎన్టీవీ చేతికి చేరింది. ఈ రిపోర్ట్‌లో చోటుచేసుకున్న నకిలీ పత్రాలు, ఫోర్జరీలు, నిధుల దుర్వినియోగం, పత్రాలపై సంతకాల ఫోర్జరీ లాంటి అంశాలు హచ్ఛగా వెలుగులోకి వచ్చాయి. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మే 2024 కంటే ముందే జరిగిన ఘటనల నేపథ్యంలో, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి…
వేల మంది హిందూ మహిళల మత మార్పిడి.. ఛంగూర్ బాబా నెట్వర్క్.. జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాబా ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడిలు చేస్తున్న ముఠాకు కీలకంగా ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడవుతోంది. హిందూ, సిక్కు మహిళలే లక్ష్యంగా భారీ మతమార్పిడి నెట్వర్క్‌ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఛేదించారు. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలరాంపూర్ జిల్లాలోని మాధ్‌పూర్ కేంద్రంగా, విలాసవంతమైన భవనం అడ్డాగా ఛంగూర్ బాబా ఈ అరాచకాలకు…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు మల్కాజ్‌గిరి కోర్టు రిమాండ్ విధించింది. హెచ్‌సీఏ స్కామ్‌లో 12 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జగన్మోహన్‌తో పాటు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన సతీమణి కవితకు మల్కాజ్‌గిరి కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. కవితను చంచల్ గూడ జైలుకు, మిగతా వారిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. Also Read: Kanipakam Temple: విరిగిన…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావును తెలంగాణ సీఐడీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో టికెట్ల వివాదం నేపథ్యంలో చేపట్టిన దర్యాప్తులో ఆర్థిక అక్రమాలు వెలుగుచూడటంతో.. జగన్‌మోహన్‌ని సీఐడీ అదుపులోకి తీసుకుంది. జగన్‌మోహన్‌తోపాటు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలను సీఐడీ అరెస్ట్ చేసి విచారించింది. ఈ కేసులో సంచలన విషయాలు…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు అక్రమాల చిట్టా కలకలం రేపుతోంది. హెచ్‌సీఏలో జగన్మోహన్ రావు అక్రమాలకు అంతే లేదు. హెచ్‌సీఏలోకి అడ్డదారిలో వచ్చిన ఆయన.. వందల కోట్లు దోపిడీ చేశారు. క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ ఇస్తున్న నిధులను జగన్మోహన్ రావు దుర్వినియోగం చేశారు. ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ వివాదంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా బుధవారం జగన్మోహన్ రావును సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నేడు మల్కాజిగిరి కోర్టులో ఆయన్ను సీఐడీ హాజరుపరచనుంది. జగన్మోహన్‌తో…
ఎస్ఆర్హెచ్, హెచ్‌సీఏ వివాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సీఐడీ హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌తో పాటు బాడీని అదుపులోకి తీసుకుంది. గత ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా ఎస్ఆర్‌హెచ్ హెచ్‌సీఏ మధ్య టికెట్ల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మ్యాచ్ సందర్భంగా టికెట్స్ కేటాయించలేదని ఆరోపిస్తూ.. కార్పొరేట్ బాక్స్ కు తాళం వేసింది హెచ్‌సీఏ. ఈ ఘటనతో హైదరాబాద్ వదిలి పోతామని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి ప్రభుత్వం ఆదేశించింది.
హెచ్‌సీఏ అక్రమాలపై సంచలన విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిగింది. హెచ్‌సీఏ సెక్రటరీ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచేజ్ పై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు నిర్ధారణ అయింది.
అజారుద్దీన్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కి అజారుద్దీన్ పేరు తొలగించవద్దని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ క్రికెట్ సంఘంకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హెచ్‌సీఏను హైకోర్టు ఆదేశించింది. నార్త్ స్టాండ్స్‌కు ఉన్న అజహరుద్దీన్ పేరు తొలగించాలని గత వారం హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు. Also Read:Rain Alert: విశాఖకు వర్ష సూచన.. సింహాచలంలో వేగంగా దర్శనాలు తన…