హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కమిటీ సభ్యులపై కేసు నమోదైంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సందీప్ రాజన్, సందీప్ త్యాగిలు డబ్బులు డిమాండ్ చేశారని ఇద్దరు ప్లేయర్స్ తల్లిదండ్రులు ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అండర్ 19, అండర్ 23 లీగ్‌లలో ఆడించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వనందుకు మంచి ప్రదర్శన చేసినా తన కుమాడిని ఆడనివ్వలేదని, సెలక్షన్ కమిటీపై చర్యలు తీసుకోవాలని ఓ ప్లేయర్ తండ్రి డాక్టర్ రామారావు…
ఇండియా క్రికెట్‌లో అన్ని రాష్ట్రాల అసోసియేషన్లు తమ ప్లేయర్ల కోసం లీగ్స్ నడిపిస్తున్నాయి. కొత్త టాలెంట్‌ను బయటికి తీయడంలో ఈ లీగ్స్ ఉపయోగపడుతాయి. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాత్రం అందుకు భిన్నం. ఇక్కడ లీగ్ పక్కన పెడితే కనీసం వివాదం లేకుండా.. ఈ అసోసియేషన్‌ని రన్ చేయలేరు. ఇప్పటికే ఎన్నో వివాదాలతో పరువు పోగొట్టుకున్న హెచ్‌సీఏ.. ఇప్పుడు మరో వివాదంలో నిలించింది. Also Read: Afghanistan Cricket: చరిత్ర సృష్టించిన ఆఫ్గనిస్తాన్.. ప్రపంచంలోనే మొదటి…
హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఢిల్లీతో ఈ నెల 15వ తేదీన ఆరంభమయ్యే మ్యాచ్ కోసం హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ బుధవారం 15 మందితో సభ్యుల కూడిన జట్టును ప్రకటించింది. అందులో తిలక్ వర్మను కెప్టెన్‌గా, రాహుల్ సింగ్ ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల వ్యవహారంలో సీఐడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్ సీఏలో భారీ కుదుపు చోటుచేసుకుంది. హెచ్ఎసీఏ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సస్పెండ్ చేసినట్లు తెలిపింది. కార్యదర్శి దేవరాజ్, ఖజాంచి శ్రీనివాస్ రావు పదవి నుంచి తొలగించినట్లు పేర్కొంది. 28 జూలై 2025న జరిగిన అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. Also Read:Actress Kalpika:…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల పుట్ట కదులుతోంది.. సీఐడీ దర్యాప్తులో మరో భారీ స్కాం వెలుగుచూసింది. సమ్మర్ క్యాంప్‌ల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు హెచ్‌సీఏ కేటుగాళ్లు. తప్పుడు లెక్కలు చూపించి కేవలం ఒక్క నెల రోజుల్లోనే ఏకంగా 4 కోట్ల రూపాయలు కాజేశారు జగన్మోహన్‌రావు అండ్ కో. ఆటగాళ్లు శిక్షణ ఇవ్వకుండానే ఇచ్చినట్టు.. ఓ బ్యాటు.. ఓ బాల్ మాత్రమే ఇచ్చి.. కిట్ మొత్తం ఇచ్చినట్టు సృష్టించారు. సీఐడీ దర్యాప్తు లో HCA డొంక కదిలి……
Devaraj Arrested: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవకతవకల కేసులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్‌ను ఈరోజు (జూలై25) సాయంత్రం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Jaganmohan Rao CID Investigation: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. సీఐడీ కార్యాలయంలో హెచ్‌సీఏ నిందితుల విచారణ కొనసాగుతోంది. ఐదవ రోజు ఐదుగురు నిందితులను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా జగన్మోహన్ రావు దొడ్డిదారిన ఎన్నికైనట్లు సీఐడీ గుర్తించింది. హెచ్‌సీఏ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రావు 23 ఇన్‌స్టిట్యూషన్స్ ఓట్లను అక్రమంగా వేయించుకున్నట్లు…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగిస్తోంది. సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హెచ్ సీఏలో లో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఈడి గుర్తించింది. టెండర్లు లేకుండా అనుకూలమైన వారికే పనులు కేటాయించడంతో HCA సభ్యులు భారీగా లబ్ది పొందినట్టు ఈడి గుర్తించింది. కొద్ది రోజుల క్రితమే HCA మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అతడి భార్యను విచారించింది ఈడీ. రూ. 90 లక్షల రూపాయలు క్విడ్ ప్రో కో జరిగినట్టు…
ప్రెసిడెంట్ తో సహా మరో నలుగురు జైలుపాలయ్యారు…!! తీగ లాగితే డొంక కదిలి… అందరి బాగోతం బయటపడుతోంది..!! వందల కోట్ల అవినీతి చూసి జనాలు ఛీ కొడుతున్నారు..!! అయినా HCA తీరు మారడం లేదు. నెక్ట్స్ నేనే ప్రెసిడెంట్… నువ్వు సెక్రెటరీ… అని కొందరంటే… నీ బాగోతం కూడా బయటపెడతా… నేనే ప్రెసిడెంట్ అంటున్నాడట మరో పెద్దాయన !! అవినీతి మరకను కడిగిపారేసి.. ఇప్పటికైనా హెచ్‌సీఏలో ప్రక్షాళన చేపట్టాల్సిందిపోయి.. అవినీతి తిమింగలాల వారసులు పుట్టుకొస్తున్నారట !! హైదరాబాద్…