ఇటీవల తమిళనాడులో జరిగిన ఆల్ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో.. హైదరాబాద్ క్రికెట్ జట్టుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శినపల్లి జగన్‌మోహన్ రావు భారీ నజరానా ప్రకటించారు. ఏడేళ్ల తర్వాత టైటిల్ సాధించిన ఆటగాళ్లకు రూ. 25 లక్షల నగదు బహుమతి అందజేస్తున్నట్టు జగన్‌మోహన్ రావు ప్రకటించారు.
Read Also: CM Chandrababu: ఏచూరితో కలిసి పని చేశాను.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నా
గత రంజీ సీజన్‌లో ప్లేట్ డివిజన్‌లో అజేయ విజేతగా నిలిచిన హైదరాబాద్.. బుచ్చిబాబు టోర్నమెంట్‌లోనూ ఇతర జట్లను చిత్తుగా ఓడించింది. ఈ సందర్భంగా.. జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ, సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ జట్టు బుచ్చిబాబు టోర్నమెంట్‌లో విజేతగా నిలవటం సంతోషంగా ఉందన్నారు. గత సీజన్‌లో రంజీ ప్లేట్ ఛాంపియన్‌గా నిలిచాం.. ఈ సీజన్‌లో రంజీ ఎలైట్ ఛాంపియన్‌గా నిలువాలనేది తన లక్ష్యమని చెప్పారు. ఈ క్రమంలో.. క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి అవసరైన సహాయ సహకారాలు హెచ్‌సీఏ అందించేందుకు సిద్ధంగా ఉందని జగన్‌మోహన్ తెలిపారు.
శుక్రవారం(సెప్టెంబర్ 13) ఉప్పల్ స్టేడియం వేదికగా హెచ్‌సీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా.. హైదరాబాద్ టీమ్, కోచ్ చటర్జీని హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కాగా.. ఫైనల్లో ఛత్తీస్‌ఘడ్ జట్టును హైదరాబాద్ జట్టు ఓడించింది. 243 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగుల ఆధిక్యం సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే ఆట తీరు కనబరిచింది.
🏆 ₹25 Lakh Prize Money to the Champions!🏆
It was an honor to felicitate the Hyderabad Cricket Team today at RGICS, Uppal, after their thrilling victory in the All India Buchi Babu Tournament!🎉
I am pleased to announce a prize money of ₹25 lakh to celebrate their… pic.twitter.com/4zBy5FJVTs
— Jagan Mohan Rao Arishnapally (@JaganMohanRaoA) September 13, 2024