హర్యానాలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ పరాజయం పాలైంది. తాజాగా మార్చి 2న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఫరీదాబాద్, హిసార్, రోహతక్, కర్నాల్, యమునానగర్, గురుగ్రామ, మనేసర్‌కు ఎన్నికలు జరిగాయి.
కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (23) హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. మార్చి 1న రోహ్‌తక్-ఢిల్లీ హైవేలోని సంప్లా బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌లో నర్వాల్ మృతదేహం లభ్యమైంది.
Congress: హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ పునర్వ్యవస్థీకరణ చేసింది. సామాజిక న్యాయం అనే నినాదం కాంగ్రెస్ పార్టీపై బలమైన ముద్ర వేసింది.
పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగి ఆరు సంవత్సరాలు గడిచాయి. ఫిబ్రవరి 14, 2019న, జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాది పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు్ను ఢీకొట్టాడు.
దేశ రాజధాని ఢిల్లీలో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. యమునా జలాలను హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ కేజ్రీవాల్ ఆరోపించారు.
Aravind Kejriwal : యమునా నది జల కాలుష్యంపై తన ప్రకటనలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటీసుకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
Dera Baba: హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా అధినేత రామ్ రహీమ్‌కు మరోసారి బెయిల్ వచ్చింది. దీంతో ఆయన ఈరోజు (జనవరి 28) ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనను స్వాగతించేందుకు డేరా బాబా ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ స్వయంగా కారులో జైలుకు వచ్చింది.
Heavy Snowfall: దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కమ్మేసింది. దీంతో ఈ రోజు (జనవరి 10) ఉదయం ఢిల్లీలో పొగమంచు ఆవరించడంతో దృశ్యమానతను సున్నాకి పడిపోయింది. దీని ప్రభావంతో సుమారు 150 కంటే ఎక్కువ విమానాలు, దాదాపు 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.