మరణం ఎప్పుడు.. ఎలా సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి దాకా కళ్ల ముందు తిరిగిన వాళ్లే అంతలోనే విగతజీవిగా మారడం జీర్ణించుకోలేని విషయం. ఇలాంటి ఘటనే హర్యానాలోని రోహ్తక్లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏ స్త్రీ అయినా వ్యక్తిత్వ హనానికి భంగం కలిగితే సహించలేదు. ఎవరైనా హద్దు మీరు ప్రవర్తిస్తే మాత్రం తమ ప్రతాపాన్ని చూపిస్తారు. డ్యాన్సరే కదా? అని ఒక కామాంధుడు హద్దులు దాటి ప్రవర్తించాడు. దీంతో తీవ్ర కోపాద్రిక్తురాలైన ఆమె చెంపచెళ్లు మనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్‌కు న్యాయం జరగాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. చండీగఢ్‌లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పూరన్ కుమార్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి సంతాపం తెలిపారు.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో ఏసీ పేలి భార్యాభర్తలతో పాటు కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. పెంపుడు కుక్క కూడా చనిపోయింది. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ రోజుల్లో కూడా మూడ నమ్మకాలతో, బూత వైద్యులతో జనాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. జనాలు మూడ నమ్మకాలను నమ్మి కొన్నిసార్లు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటన తాజాగా హర్యానాలో చోటుచేసుకుంది. హిసార్ జిల్లాలోని ఉమ్రా గ్రామంలో నిద్రిస్తున్న ఒక యువకుడిని పాము కాటు వేసింది. అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. బూత వైద్యునికి దగ్గరికి తీసుకెళ్లడంతో యువకుడు చనిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భివానీ రోడ్డులోని ఖండా ఖేడి గ్రామానికి చెందిన 35…
హర్యానాలో భూకంపం సంభవించింది. ఝజ్జర్‌లో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్న సమయంలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది.
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం అని ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు మాత్రం మారడం లేదు. ఇంట్లో ఉన్న తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మలు తమ మనుమరాలు, మనువడి పెళ్లి చూసి చనిపోవాలి అని తమ కోరికలను వెలిబుచ్చుతుంటారు. వాళ్ల కోరికలను కాదనలేక పిల్లలకు పెళ్లి చేసేందుకు రెడీ అవుతుంటారు. ఇదే తరహాలో హర్యానాలో ఓ నానమ్మ మునిమనవడిని చూడాలనే కోరకతో తన మనుమరాలికి పెళ్లి చేయాలని చూసింది. కానీ ఆ అమ్మాయి మైనర్ కావడంతో పెళ్లికి బ్రేకులు పడ్డాయి.…
హర్యానాలో దారుణం జరిగింది. ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌ను అత్యంత దారుణంగా దుండగులు కాల్చి చంపేశారు. సోనేపట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Shocking: హర్యానా హిసార్‌లో సంచలన ఘటన జరిగింది. ఒక గ్రామంలో ఇద్దరు మైనర్లు తమ హెయిర్ కట్ చేసుకోలేదని, క్షమశిక్షణ పాటించడం లేదని స్కూల్ ప్రిన్సిపాల్ తిట్టినందుకు ఏకంగా ఆయనను పొడిచి చంపారు. ప్రిన్సిపాల్‌పై కోపంతో ఇద్దరు విద్యార్థులు ఈ హత్యకు పాల్పడినట్లు హన్సి ఎస్పీ అమిత్ యశ్వర్థన్ తెలిపారు.
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మార్పు రావడం లేదు. ఎక్కడొక చోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హర్యానాలో కోడలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.