Himani Narwal: కాంగ్రెస్ కార్యకర్త హత్య కేసులో నిందితుడు అరెస్ట్.. అతడెవరంటే..!
- కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ హత్య కేసులో సిట్ ఏర్పాటు
- సోమవారం నిందితుడిని అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు
- హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (23) హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. మార్చి 1న రోహ్‌తక్-ఢిల్లీ హైవేలోని సంప్లా బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌లో నర్వాల్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసు దర్యాప్తు కోసం హర్యానా ప్రభుత్వం.. ఆదివారం సిట్ ఏర్పాటు చేసింది. ఇక రంగంలోకి దిగిన సిట్ బృందం.. సోమవారం ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఝజ్జర్‌కు చెందిన సచిన్‌గా గుర్తించారు. నిందితుడు… నర్వాల్‌కు పరిచయం ఉన్న వ్యక్తేనని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Chhaava : ఛావా తెలుగు ట్రెయిలర్ వచ్చేసింది
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
అయితే హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు నిందితుడిని.. పోలీస్ కస్టడీ కోరతామని సిట్ తెలిపింది. ఇద్దరి మధ్య వ్యక్తిగత ఘర్షణ ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నర్వాల్.. రోహ్‌తక్‌లోని విజయ్ నగర్‌లో నివసిస్తోంది. శనివారం రోహ్‌తక్ జిల్లాలో సూట్‌కేస్‌లో ఆమె మృతదేహం దొరికింది. శరీరంపై గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉంటే హంతకులను అరెస్ట్ చేసే వరకు దహనం చేయమని బాధితురాలి తల్లి కన్నీటి పర్యంతం అయింది. కాంగ్రెస్‌లో తమ కుమార్తె ఎదుగదలను ఓర్వలేకే ఈ హత్యకు పాల్పడ్డారని బాధితురాలి తల్లి సవిత పేర్కొంది. తమ కుమార్తె.. పార్టీ కోసం అంకిత భావంతో పని చేస్తుందని.. రాహుల్ గాంధీ జోడో యాత్రలో కూడా చురుగ్గా పాల్గొందని గుర్తుచేసింది. పార్టీ కోసం తమ కుమార్తె జీవితం అంకితం చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Shruti Haasan : శృతి హాసన్.. కుర్రకారు మదిని దోచెన్
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..