Karnataka: నన్నే పెళ్లి చేసుకోవారా: బాయ్‌ఫ్రెండ్‌పై కత్తితో మహిళ దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: సీన్ రివర్స్ అయింది. కర్ణాటకలో పెళ్లికి నిరాకరించాడని ఒక యువతి, తన ప్రియుడిపై దాడి చేసింది.శుక్రవారం రామనగర జిల్లాలోని బిడాడి పట్టణంలో ఈ ఘటన జరిగింది. నిందితురాలిని 30 ఏళ్ల సుధగా, బాధిత వ్యక్తిని 27 ఏళ్ల వేణు గోపాల్‌గా గుర్తించారు. ఈ ఘటన తర్వాత సుధను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. సుధ తనను పెళ్లి చేసుకోవాలని వేణుగోపాల్‌ను కోరగా, అతను కొంత కాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అతడిపై సుధ కోపం పెంచుకుంది. గురువారం రాత్రి వీరిద్దరి మధ్య ఇదే విషయమై మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సుధ తనతో తెచ్చుకున్న కత్తితో వేణుగోపాల్‌పై దాడికి పాల్పడింది. అతడి ఛాతీ, కడుపు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
వేణు గోపాల్ బిడాడితో మ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు, సుధ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వారు జిమ్‌లో కలుసుకున్నారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దాదాపుగా ఏడాది కాలంగా ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారు. సుధ వేణు గోపాల్ ఇంటికి కూడా వెళ్లేది. అయితే, గత 4 నెలలుగా వేణు సుధకు దూరంగా ఉంటున్నాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు. అతను వేరే మహిళతో తిరుగుతున్నట్లు సుధకు తెలిసింది. దీంతోనే వేణుపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ప్లాన్ ప్రకారమే దాడి చేయడానికి ఒక కత్తిని తన బ్యాగ్‌లో సుధ ఉంచుకుని తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి ఆమె వేణుగోపాల్‌ను ఇంటి నుంచి బయటకు రావాలని కోరింది. అతను వచ్చిన సమయంలోనే ఆమె దాడికి పాల్పడింది. దాడి తర్వాత వేణు అక్కడికక్కడే కుప్పకూలాడు. మొబైల్ ద్వారా తన కుటుంబీలకు ఫోన్ చేయగలిగాడు, వారు అతడిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. సుధను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!