హర్యానాలోని సిర్సా జిల్లాలో ఒక అసాధారణ గేదె నివసిస్తుంది. దాని పేరు అన్మోల్. పేరుకు తగ్గట్టుగానే ఈ దున్నపోతు ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. 1500 కిలోల బరువున్న ఈ గేదె భారీ ఎత్తు, విలాసవంతమైన జీవనశైలి కారణంగా చర్చనీయాంశంగా మారింది. అది తన పరిమాణానికే కాకుండా విలాసవంతమైన జీవనశైలికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది పుష్కర జాతరలో ప్రదర్శించబడింది. ఈ గేదె మీరట్‌లో జరిగిన ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్‌లో కూడా పాల్గొంది.
Anmol: హర్యానాకు చెందిన అన్మోల్ అనే దున్న జీవన శైలి చూస్తే, విలాసం అనే పదానికి చక్కగా సరిపోతుంది. ఈ దున్న ఖరీదు ఏకంగా రూ.23 కోట్లు. ఇది భారతదేశంలో జరిగే వివిధ అగ్రికల్చర్ ఫెయిర్స్‌లో అలరిస్తోంది. అన్మోల్ అనే దున్న ఏకంగా 1500 కిలోల బరువు ఉంది. దీని పరిమాణం, వంశపారంపర్యత, సంతానోత్పత్తి సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది.
కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో పంట వ్యర్థాలను తగలబెట్టిన రైతులకు విధించే పెనాల్టీని రెట్టింపు చేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు రూ.30,000 వరకు జరిమానాను విధించేలా ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్ ఎన్నికల హామీల తీరుపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తాజాగా ఎన్నికల హామీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కౌంటర్ ఎటాక్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు
Election Commission: ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో బీజేపీ సంచలన విషయం సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లను గెలుచుకుని మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేసింది. మరోసారి కాంగ్రెస్ 37 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది.
హర్యానాలోని జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. రోహ్‌తక్‌లోని సంప్లా పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురైదుగురికి స్వల్ప కాలిన గాయాలయ్యాయి. దూకడం వల్ల కొందరు గాయపడ్డారు. మంటల కారణంగా కోచ్ మొత్తం పొగతో నిండిపోయి నల్లగా మారింది.
టికెట్ తీసుకోనందుకు హర్యానాకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌కు రాజస్థాన్ రోడ్‌వేస్‌లో చలాన్ జారీ చేశారు. దీంతో హర్యానా, రాజస్థాన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ కారణంగా.. హర్యానా పోలీసులు రాజస్థాన్ రోడ్‌వేస్‌కు చెందిన 90 బస్సులకు చలాన్లు జారీ చేయగా.. ఆదివారం రాజస్థాన్‌లో హర్యానా రోడ్‌వేస్ బస్సులకు 26 చలాన్లు జారీ చేయబడ్డాయి.
Supreme Court: చలికాలం సమీపిస్తుందంటే చాలు.. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. పంట వ్యర్థాలు తగలబెట్టడం సమస్యపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Haryana Elections: ఇటీవల హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ రోజు నయాబ్ సింగ్ సైనీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, హర్యానాలోని 20 అసెంబ్లీ స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్ని గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారాన్ని నిలిపేసేందుకు నిరాకరించింది.
Nayab Singh Saini Oath: హర్యానా నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం పంచకులలోని షాలిమార్ మైదానంలో జరిగిన వేడుకలో గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమి నేతలు హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. హర్యానాలో…