పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగి ఆరు సంవత్సరాలు గడిచాయి. ఫిబ్రవరి 14, 2019న, జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాది పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు్ను ఢీకొట్టాడు. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులు అమరులయ్యారు. ఈ దాడి తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన జవాన్ల పిల్లల చదువు ఖర్చులను బరించే బాధ్యతను సెహ్వాగ్ తీసుకున్నాడు.
READ MORE: Jaggery: చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిదా?
కాగా.. అమరులైన వారిలో విజయ్ సోరెంగ్ జవాన్ కూడా ఉన్నారు. అమరుడు విజయ్ సోరెంగ్ కుమారుడు…రాహుల్ సోరెంగ్. రాహుల్ ఇప్పుడు క్రికెట్ లో రాణిస్తున్నాడు. రాహుల్ సోరెంగ్ ఇటీవలే హర్యానా అండర్-19 జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని వీరేంద్ర సెహ్వాగ్ స్వయంగా తెలిపారు. పుల్వామా దాడి జరిగి ఆరేళ్లయిన సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను పంచుకున్నారు. “పుల్వామా దాడి జరిగి 6 సంవత్సరాలు అయింది. మన వీర సైనికుల బలిదానాన్ని భర్తీ చేయలేం. కానీ.. రాహుల్ సోరెంగ్ S/O షహీద్ విజయ్ సోరెంగ్, అర్పిత్ సింగ్ S/O షహీద్ రామ్ వకీల్ గత 5 సంవత్సరాలుగా సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్నారు. ఇది నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. రాహుల్ ఇటీవలే హర్యానా అండర్-19 జట్టులోకి ఎంపికయ్యాడు.” అని సెహ్వాగ్ పేర్కొన్నారు.
READ MORE: CM Revanth Reddy: నేను కొందరికి నచ్చకపోవచ్చు.. నా పని నేను చేస్తున్నా