Haryana: మరీ ఇంత దారుణమా?.. ఆస్తి కోసం కన్న తల్లిని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టిన కూతురు(వీడియో)
- హర్యానాలో హృదయ విదారక సంఘటన
- కన్న తల్లిని చితకబాదిన కూతురు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని హిసార్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తిని తన పేరు మీదకు మార్చుకోవడానికి.. ఓ కూతురు తన తల్లిని దారుణంగా హింసించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు మూడు నిమిషాల నిడివి గల ఆ వీడియోలో.. ఆ మహిళ తన తల్లి తొడలను సైతం కొరికింది. నీ రక్తం తాగుతానని కూతురు తన తల్లితో చెబుతూ విచ్చల విడిగా దాడి చేసింది.
READ MORE: Nikhila Vimal: టాలీవుడ్ బై చెప్తే మాలీవుడ్ గుండెల్లో పెట్టేసుకుంది!
Also Read
- TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
వైరల్ వీడియోలో కన్న కూతరు తన తల్లిని తీవ్రంగా కొడుతుంది. తల్లి తొడను కొరికి, ఆమెను నేలకేసి కొట్టి.. జుట్టు పట్టుకుని పట్టుకుంది. నొప్పి భరించలేని తల్లి బోరున విలపిస్తున్న కుమార్తెకు కనికరం రాలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తల్లి కొట్టొద్దని దండం పెట్టింది. కానీ ఆ కుమార్తె మాత్రం.. నువ్వు నా చేతుల్లో చనిపోతావు అంటూ చితక బాదింది. తనపై దాడి చేస్తున్న బాధితురాలి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తికి సంబంధించి ఆమె తల్లినొ కొట్టిందని సోదరుడు ఫిర్యాదు చేశాడు.
READ MORE: CM Revanth Reddy: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏటీసీ..
ఈ ఘటన హిసార్ ఆజాద్ నగర్‌లోని మోడరన్ సాకేత్ కాలనీలో జరిగింది. తల్లిని కొట్టిన కూతురు పేరు రిటా. రీటాకు రెండేళ్ల క్రితం రాజ్‌గఢ్ సమీపంలోని గ్రామానికి చెందిన సంజయ్ పునియాతో వివాహం జరిగింది. తన భర్తకు ఎలాంటి సంపాదన లేదు. వివాహం తర్వాత.. ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చి ఆస్తి కోసం తన తల్లిని వేధించడం ప్రారంభించింది. ఆ మహిళ కురుక్షేత్రలోని కుటుంబానికి చెందిన పలు ఆస్తులను అమ్మేసి ఇప్పటికే దాదాపు రూ.65 లక్షలు తన దగ్గర ఉంచుకుంది. ఇప్పుడు తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిని తన పేరుమీదకు మార్చాలని డిమాండ్ చేస్తోంది. ఇంటిని పేరు మీద రిజిస్టర్ చేయమని తల్లిని ఇంత దారుణంగా హింసించింది. కాగా.. బాధితురాలి కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Pz Help
Shocking video from HARYANA.Daughter torturing her own mother.#SaveSeniorCitizen @mlkhattar@cmohry @police_haryana #Vina2025 pic.twitter.com/WBaHstTTBK
— Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) February 27, 2025
తాజావార్తలు
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!