హర్యానాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు కారులో లభ్యమయ్యాయి. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల ఫిర్యాదుతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ ఏడాది తొలిసారిగా యాక్టివ్ కేసులు 1000 దాటాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసి గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్య శాఖ ప్రకారం, కేరళలో అత్యధికంగా 430 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 209, ఢిల్లీ 104 యాక్టివ్ కేసులతో మూడవ స్థానంలో ఉన్నాయి. కర్ణాటకలో కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య…
AICC Observers: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను దేశవ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో జిల్లా అధ్యక్షుల ఎంపిక కోసం పరిశీలకులను నియమించింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు నేతలకు ఏఐసిసి పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ నేత, సిడబ్ల్యూసి (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సభ్యుడు గిడుగు రుద్రరాజు, ఏఐసిసి సెక్రటరీ సిరివెళ్ళ…
పాకిస్థాన్‌పై ఇటీవల భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ జరిగింది. ఎప్పటికప్పుడు ఆపరేషన్ సిందూర్ విషయాలను మీడియాకు తెలియజేస్తూ ఉండేవారు. ఈ విధంగా వీరిద్దరూ గుర్తింపులోకి వచ్చారు.
పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతికి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌లో @Travel with JO పేరుతో ఖాతా ఉంది. ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన అనేక వీడియోలు, రీల్స్‌ను పోస్ట్ చేసింది. పాకిస్థాన్ లో రూపొందించిన రీల్స్, వీడియోల ద్వారా పాక్‌లో సానుకూల అంశాలను చూయించడానికి ప్రయత్నించింది. పాకిస్థాన్‌లో చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయంటూ..
పాకిస్థాన్ దేశానికి, సైన్యానికి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్‌తో సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నెట్‌వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉంది. వీరు పాక్ ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల్లో "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమె కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది.. 2023లో పాకిస్థాన్ సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె పర్యటన సందర్భంగా..…
Viral : వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అన్న మాటను మరోసారి నిజం చేసిన ఘట్టం ఇది. హర్యానాకు చెందిన ఓ తాతయ్య, తన మనవడు ఇచ్చిన ఫోర్డ్ మస్టాంగ్ కీతో కారులోకి ఎక్కి ఊహించని రీతిలో డ్రిఫ్టింగ్ చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. సినీ స్టైల్లో స్టంట్లు చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. “తాత రాక్ – మనవడు షాక్!” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. దేవ్ చహల్ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో,…
Money Laundering Case: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చోకర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.
Shocking: పెళ్లి చేసుకోవాలంటేనే మగాళ్లు భయపడే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో భర్తలు, కాబోయే భర్తల్ని చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. హర్యానా ఫరీదాబాద్‌కి చెందిన 28 ఏళ్ల వ్యక్తి తన పెళ్లికి రెండు రోజుల ముందు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కాబోయే భర్తపై, మహిళ ప్రియుడు, ఇతరులు దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి ప్రస్తుతం కోమాలో ఉన్నాడు.
హర్యానాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. అచేతన స్థితిలో చికిత్స పొందుతున్న ఓ మహిళా రోగిపై ఆస్పత్రి సిబ్బంది అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఐసీయూలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోరం గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది.