Illicit affair: ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేని ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. హర్యానాలోని రోహ్తక్లోని వ్యక్తిని తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి, ఆపై పొలంలో 7 అడుగుల గొయ్యి తీసి సజీవంగా పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. యోగా గురువుగా ఉన్న వ్యక్తి హత్య గతేడాది డిసెంబర్లో జరిగింది. అయితే, పోలీసులు సుదీర్ఘ దర్యాప్తు తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి, సోమవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మాజీ ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ స్వీటీ బోరా, ఆమె భర్త దీపక్ హుడా మధ్య వివాదం మరింత పెరుగుతోంది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుకున్న తర్వాత ఈ వివాదం ఎక్కువైంది. భర్త దీపక్ హుడాపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీపక్ హుడాకు అబ్బాయిలంటే ఆసక్తి ఉందని స్వీటీ చెప్పింది. ఈ విషయం తనకు తరువాత తెలిసిందని చెప్పింది.
హర్యానాలోని బహదూర్గఢ్లో శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనను పరిశీలించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఎన్నికల పారదర్శకతపై పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ దేశంలోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలను డాటాను విశ్లేషించింది. మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేలలో 4,092 మంది అఫిడవిట్లను పరిశీలించింది. ఈ మేరకు ఓ నివేదిక తయారు చేసింది. గత ఐదు సంవత్సరాలలో వేరే పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి.. పార్టీ మారిన 63 మంది ఎమ్మెల్యేల జాబితా కూడా రూపొందించింది. ఎమ్మెల్యేల నేర నేపథ్యం, వారి ఆస్తుల వివరాల గురించి…
Asia Record: మాములుగా ఎక్కడైనా ఒక ఆవు రోజుకి 5 నుంచి 10 లీటర్ల వరకు పాలు ఇస్తుందన్న విషయం అందిరి తెలిసిందే. కానీ, మరికొన్ని జాతుల ఆవులు ఏకంగా 20 లీటర్లకు పైగా పాలను ఇవ్వగలవు కూడా. కాకపోతే ఇప్పుడు, హరియాణాకు చెందిన ఓ ఆవు ఏకంగా 24 గంటల వ్యవధిలో 87.7 లీటర్ల పాలను ఇచ్చి అద్భుత రికార్డును నెలకొల్పింది. దీనితో ఆ ఆవు ఆసియాలోనే ఒకే ఒక్క రోజులో ఎక్కువ పాలు ఇచ్చిన…
Haryana: కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోర పరాజయం ఎదురైంది. హర్యానా స్థానిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. అధికార బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యానాలో ప్రభావంతమైన నేతగా చెప్పబడుతున్న భూపిందర్ హుడాకు కంచుకోటగా ఉన్న గురుగ్రామ్, రోహ్తక్తో సహా 10 మేయర్ స్థానాల్లో 09 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మరోస్థానంలో స్వతంత్ర అభ్యర్థి-బీజేపీ తిరుగుబాటు నేత డాక్టర్ ఇందర్జిత్ యాదవ మానేసర్ని గెలుచుకున్నారు.
హర్యానాలో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ పరాజయం పాలైంది. తాజాగా మార్చి 2న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఫరీదాబాద్, హిసార్, రోహతక్, కర్నాల్, యమునానగర్, గురుగ్రామ, మనేసర్కు ఎన్నికలు జరిగాయి.
కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (23) హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. మార్చి 1న రోహ్తక్-ఢిల్లీ హైవేలోని సంప్లా బస్టాండ్ సమీపంలో సూట్కేస్లో నర్వాల్ మృతదేహం లభ్యమైంది.
Congress: హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ పునర్వ్యవస్థీకరణ చేసింది. సామాజిక న్యాయం అనే నినాదం కాంగ్రెస్ పార్టీపై బలమైన ముద్ర వేసింది.