Tractor March: పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు జనవరి 26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్‌కి పిలుపునిచ్చారు. ప్రముఖ రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో రైతుల సంఘాల నుంచి ఈ ప్రకటన వెలువడింది.
హర్యానాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని నలుగురి చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తాము నిద్రిస్తున్న సమయంలో ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్లారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు తీవ శోక సంద్రంలో మునిగిపోయారు...
Om Prakash Chautala: హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా (89) కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో ఈ రోజు (డిసెంబర్ 20) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నుహ్‌లోని లహర్‌వాడి గ్రామంలో శుక్రవారం పరస్పర విబేధాల కారణంగా రెండు పార్టీల మధ్య భారీ రాళ్ల దాడి జరిగింది. ఈ క్రమంలో 32 ఏళ్ల యువతి సజీవ దహనమైంది. యువతి మంటల్లో కాలిపోయింది.
Delhi Chalo: పంజాబ్ రాష్ట్రంలోని శంభు సరిహద్దు నిరసన ప్రదేశం నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం ఈ రోజు (డిసెబర్ 6) దేశ రాజధాని ఢిల్లీకి మార్చ్‌గా బయలు దేరుతుందని రైతు నాయకుడు స్వరణ్ సింగ్ పంధేర్ పేర్కొన్నారు.
భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేష్ ఫోగట్ కనిపించడం లేదంటూ హర్యానాలోని జులానా నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Punjab: పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజున 400కి పైగా పంట వ్యర్థాలు తగుల బెట్టారు. ఈ సీజన్లో పంజాబ్ లో కేసుల సంఖ్య 8,404కి చేరిపోయింది. రిమోట్ సెన్సింగ్ డేటా సాయంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
హర్యానాలోని సోనిపట్‌లోని ఖర్ఖోడాలో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పెళ్లి జరిగిన మరుసటి రోజే నవ వధువు పారిపోయింది. పెళ్లికూతురు అర్ధరాత్రి టీలో మత్తు మందు కలిపి అత్త, భర్తలకు తాగించింది. ఆ తర్వాత ఇద్దరు అపస్మారక స్థితిలోకి చేరగానే వధువు ఇంట్లోని బంగారు నగలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనపై ఖార్ఖోడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఢిల్లీని వణికించిన తీవ్ర వాయు కాలుష్యం.. ఇప్పుడు హర్యానాకు చేరింది. హర్యానాలో కాలుష్య విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. కేవలం ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహించనున్నారు.