Shivaji: అలా 1800 కోట్లు పోగొట్టుకున్న శివాజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ లోకి వెళ్లి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆయన, వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘సంప్రదాయానీ సుప్పీనీ శుద్ధపూసనీ’ అనే సినిమా మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సినిమాలు నిలిపివేసిన తర్వాత రొటేషన్ కోసం స్థలాలు కొని అమ్మడం లాంటివి చేసేవాడినని చెప్పుకొచ్చారు. అలా యాదగిరిగుట్ట దగ్గరలో 70,000 రూపాయలకు ఎకరం చొప్పున కొన్న తాను, ఒక్కొక్క ఎకరం 9 లక్షలకు అమ్మినట్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆ స్థలం ధర బాగా పెరిగిపోయిందని అన్నారు.
Also Read:Raja Saab: రాజాసాబ్ ఫ్లాప్ కలిసొచ్చిందా?
Also Read
అంతేకాక, ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్న ప్రదేశంలో సుమారు 18 ఎకరాలు కొని, ఆ తర్వాత తక్కువ లాభానికే అమ్మినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అప్పుడు రొటేషన్ కోసం అలా చేశాను కానీ, ఇప్పుడు అక్కడ అదే స్థలం ఉండి ఉంటే ఒక్కొక్క ఎకరం 100 కోట్లు పలికేదని, అంటే దాదాపుగా తాను 1800 కోట్లు నష్టపోయానంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పటికి తాను రొటేషన్ గురించి మాత్రమే ఆలోచించేవాడినని, కానీ ఇంతగా ధరలు పెరిగిపోతాయనే ఆలోచన తనకు లేదని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏకంగా 1800 కోట్లు నష్టపోయానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..