అది క్రీడా గ్యారేజ్…! అక్కడ చాంఫియన్‌లు తయారు చేయబడును..! అవును ఒలింపిక్స్ గేమ్స్ వచ్చిన ప్రతిసారి పతకాల పట్టికలో భారత్ ఎక్కడుందో చూసుకునేవాళ్లం..! కానీ ఇప్పుడు భారత్‌కి మెడల్స్ సాధించిన పెట్టిన వాళ్లలో ఆ రాష్ట్రం ఆటగాళ్లు ఎంతమంది అనేది ఇప్పుడు లెక్కేసుకుంటున్నాం…! ఎందుకంటే గత కొద్దికాలంగా అక్కడి ఛాంపియన్‌లు ప్రతిచోట మువ్వెన్నెల జెండాను రెపరెపలాడిస్తున్నారు..! భారతీయుల బంగారు కలను సాకారం చేశాడు నీరజ్‌చోప్రా..! సొంతూరు పానిపట్.. రాష్ట్రం.. హర్యానా…. రెజ్లింగ్‌లో ఫైనల్ వరకు వెళ్లి వెండి…
హర్యానా ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ను పరీక్ష రద్దు చేసింది. పేపర్ లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పరీక్ష రద్దయినందుకు అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, త్వరలో మళ్లీ కొత్తగా షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించింది. దాదాపు 10,300 మంది ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 22 జిల్లాల్లోని మొత్తం 35 సెంటర్లలో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. కాగా, పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలతో…
తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు వర్షాలు దంచికొట్టాయి.. మరికొన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురిశాయి.. దేశ రాజధాని ఢిల్లీలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది.. ఈ తరుణంలో.. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయంటూ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణశాఖ (ఐఎండీ).. ఈ రోజు, రేపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ రానున్న మూడు…
కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోక ముందే దేశంలో మరో వైరస్ ఇబ్బందు తెచ్చిపెడుతున్నది. పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకుతున్నది. బర్డ్‌ఫ్లూ వైరస్‌తో 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు దృవీకరించారు. బాలుడికి చికిత్స అందించిన వైద్యులు ఐసోలేషన్‌కు వెళ్లాలని, ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాలని నిపుణులు సూచించారు. ఈనెల 2 వ తేదీన హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యూమోనియా,…
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. అయితే, రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తాజాగా హర్యానాలో వంద మంది రైతులపై ఏకంగా దేశద్రోహం అభియోగాలు మోపడం సంచలనంగా మారింది.. ఇంతకీ వీరు చేసిన దేశద్రోహం ఏంటంటే.. హర్యానా డిప్యూటీ స్పీకర్, బీజేపీ నేత రణబీర్ గంగ్వా వాహనంపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడమే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 11న…
దేశంలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ ఆంక్షలు, మరికొన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక హర్యానా లో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు అమలులో ఉన్న సమయంలో బయటకు వచ్చిన వారికి వెరైటీగా పోలీసులు శిక్ష విధిస్తున్నారు. అనవసరంగా రోడ్డు మీదకు వచ్చిన కొందరిని గుంజిళ్ళు తీయిస్తూ శిక్ష విధించారు. దీనికి సంబంధించిన వీడియో…