Haryana: కాంగ్రెస్‌కి భారీ ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్..
- కాంగ్రెస్‌కి మరో ఎదురుదెబ్బ..
- హర్యానా స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్..
- సున్నాకే పరిమితమైన గ్రాండ్ ఓల్డ్ పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోర పరాజయం ఎదురైంది. హర్యానా స్థానిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. అధికార బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యానాలో ప్రభావంతమైన నేతగా చెప్పబడుతున్న భూపిందర్ హుడాకు కంచుకోటగా ఉన్న గురుగ్రామ్, రోహ్‌తక్‌తో సహా 10 మేయర్ స్థానాల్లో 09 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థి-బీజేపీ తిరుగుబాటు నేత డాక్టర్ ఇందర్‌జిత్ యాదవ్ 10వ స్థానమైన మానేసర్‌ని గెలుచుకున్నారు.
Read Also: Kakani Govardhan Reddy: నిరుద్యోగ భృతి ఊసేలేదు.. తల్లికి వందనంను ఎగ్గొట్టారు!
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
గతేడాది జరిగిన హర్యానా ఎన్నికల పరాభవం తర్వాత, మరోసారి కాంగ్రెస్‌కి దారుణమైన ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. కాంగ్రెస్‌కి గట్టి పట్టున్న రోహ్‌తక్ మేయర్ సీటు కోసం బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీ పడ్డారు. బీజేపీకి చెందిన రామ్ అవతార్ తిరుగులేని విజేతగా నిలిచారు. ఆయనకు లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి సూరజ్మల్ కిలోయ్ 45,000 కంటే ఎక్కువ ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు.
అంబాలాలో బీజేపీ విజయం సాధించింది. ఫరీదాబాద్‌లో ఆధిక్యంలో ఉంది. అంబాలాలో బీజేపీ అభ్యర్థి శైలజా సచ్‌దేవా మేయర్‌గా ఎన్ని్కయ్యారు. ఈమె కాంగ్రెస్ అభ్యర్థి అమీషా చావ్లాను 20,487 ఓట్లతో ఓడించారు. ఫరీదాబాద్‌లో పర్వీన్ జోషి కాంగ్రెస్‌కి చెందిన లతా రాణిని ఓడించారు. హిసార్‌లో బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ పోప్లి గెలిచారు. కర్నాల్‌లో రేణు బాల గుప్తా కాంగ్రెస్‌ని ఓడించారు. పానిపట్‌లో బీజేపీ నేత కోమల్ సైని గెలిచారు. సోనిపట్‌లో రాజీవ్ జైన్ గెలిచారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!