హర్యానా అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు 61 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే పోలింగ్ ముగియగానే సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఆ సంస్థలు చేసిన సర్వేలు విడుదల చేశాయి. దాదాపు అన్ని సర్వేలు హర్యానాలో కాంగ్రెస్‌కే మొగ్గుచూపించాయి.
దేశంలో శనివారం మరో రసవత్తర పోరుకు హర్యానా రాష్ట్రం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో దేశ ప్రజల చూపు హర్యానాపై ఫోకస్ మళ్లింది. ఇక్కడ కాంగ్రెస్-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌లో అనర్హతకు గురైనప్పుడు ప్రధాని మోడీ నుంచి ఫోన్ కాల్ వస్తే మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
హర్యానా ప్రజలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం, మహిళలకు ఆర్థిక సాయం, రైతులకు ఎంఎస్‌పీ హామీ, కుల గణన వంటి వాగ్దానాలు ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేసీ.వేణుగోపాల్, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉదయ్ భాన్ సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేశారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ప్రస్తుతం రెజ్లర్ వినేష్ ఫోగట్.. ఆమె కజిన్ సిస్టర్ బబిత ఫోగట్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే వినేష్.. కాంగ్రెస్‌లో చేరడాన్ని బబిత కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వినేష్ ఫోగట్ చేసిన వ్యాఖ్యలపై బబిత ఘాటుగా స్పందించారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. శుక్రవారం నుంచి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరాక కుటుంబం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోమవారం వినేష్ పెద్దనాన్న మహవీర్ ఫోగట్ స్పందిస్తూ.. వినేష్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తదుపరి ఒలింపిక్స్‌పై గురి పెట్టకుండా రాజకీయాల్లో రావడం చాలా పెద్ద తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఆమె బంధువు, బీజేపీ నేత బబిత ఫోగట్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై నిప్పుల చెరిగారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ అభ్యర్థి యూటర్న్ తీసుకున్నాడు. తొలి జాబితాలో పెహావా నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా కన్వల్‌జీత్‌సింగ్ అజ్రానా పేరును కమలం పార్టీ ప్రకటించింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాజకీయ వాతావరణం వేడుక్కుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ఇప్పటికే కొంత మంది అభ్యర్థులను వెల్లడించాయి. దీంతో ప్రత్యర్థులు ఎవరనేది తేలిపోతుంది. మంగళవారం బీజేపీ 21 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. దీంతో రాజకీయ ప్రత్యర్థులపై క్లారిటీ వస్తోంది.