హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్‌భాన్ పాల్గొన్నారు. ఏడు గ్యారెంటీలతో కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ప్రకటించింది.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అనేక ముఖ్యమైన హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హర్యానా ప్రజలకు మెరుగైన పరిపాలన, ప్రజా సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందజేస్తామని మల్లికార్జునే ఖర్గే చెప్పారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తామని.. రైతులు, కార్మికులు, యువత, మహిళల ప్రయోజనాల కోసం పార్టీ కీలక చర్యలు తీసుకుంటుందన్నారు.
Read Also: Speaker Ayyanna Patrudu: ఏరియా ఆస్పత్రే నా మానస పుత్రిక.. స్పీకర్ భావోద్వేగం
కాంగ్రెస్ గ్యారెంటీలు:
18-60 ఏళ్లు ఉన్న మహిళలందరికీ నెలకు రూ. 2000లతో పాటు.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. అలాగే.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 6000 పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. ఉద్యోగులకు OPS .. ప్రభుత్వ శాఖల్లో 2 లక్షల రిక్రూట్‌మెంట్‌లను నిర్ధారించారు. అంతేకాకుండా.. హర్యానాను డ్రగ్స్ ఫ్రీగా మారుస్తామని.. స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో తెలిపారు. వీటితో పాటు.. 25 లక్షల వరకు ఉచిత చికిత్స (చిరంజీవి పథకం), 300 యూనిట్లు ఉచిత విద్యుత్, 100 గజాల ఉచిత ప్లాట్లు, శాశ్వత గృహాలను అందించే పథకం తీసుకొస్తామని తెలిపారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత సహా కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. క్రిమీలేయర్‌ను ప్రస్తుతమున్న రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని తెలిపింది.
#WATCH | Congress President Mallikarjun Kharge releases party's guarantees as part of the party's manifesto for Haryana Assembly elections at AICC headquarters, in Delhi
Congress General Secretary KC Venugopal, former Haryana CM Bhupinder Singh Hooda, Haryana Congress chief Udai… pic.twitter.com/SGhreB1bLr
— ANI (@ANI) September 18, 2024