ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. శుక్రవారం నుంచి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. హర్యానాలోని 11 జల్లాల్లో 13 రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది. అభ్యర్థుల గెలుపు కోసం కేజ్రీవాల్ విస్తృతంగా ప్రచారం చేస్తారని పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ వెల్లడించారు. హర్యానాలో ఆప్ పూర్తి బలంతో పోటీ చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత హర్యానాలో కేజ్రీవాల్ తొలి ఎన్నికల ప్రచారం ఇదే.
ఇది కూడా చదవండి: Breaking News: పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట.. త్వరలో కొత్త ఆదాయపు పన్ను విధానం!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇటీవలే సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం రెండ్రోజులకే ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు అందజేశారు. అనంతరం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా నమ్మకమైన వ్యక్తి అయిన అతిషిని ఎంపిక చేశారు. సెప్టెంబర్ 21న అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ పొడిగింపు..
హర్యానాలో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని ఆప్ భావించింది. కానీ సీట్ల పంపకాల్లో తేడా కొట్టింది. దీంతో విడివిడిగా రెండు పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. అక్టోబర్ 5న హర్యానాలో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Pak Defense Minister Khawaja Asif: “కాంగ్రెస్-ఎన్సీకి మా మద్దతు ఉంటుంది”.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు