హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మరో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. మంగళవారం తొమ్మిది మందితో కూడిన రెండో జాబితాను ఆప్ విడుదల చేసింది. సోమవారం 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజా జాబితాతో కలిపి మొత్తం 29 స్థానాలకు అభ్యర్థులను ఆప్ వెల్లడించింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రెండో జాబితాను మంగళవారం బీజేపీ ప్రకటించింది. 21 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును ప్రకటించింది. ఇప్పటికే తొలి జాబితాలో 67 మంది అభ్యర్థులను వెల్లడించింది. తాజా జాబితాతో కలిపి మొత్తం 88 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను వెల్లడించింది.
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరింది. హస్తం పార్టీలో చేరిన కొద్ది సేపటికే ఆమెకు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కేటాయించింది. జులానా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే వినేష్ ఫోగట్ పొలిటికల్ ఎంట్రీపై ఆమె పెద్దనాన్న మహవీర్ ఫోగట్ తప్పుపట్టారు. ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు్న్నట్లు తెలిపారు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఇప్పటికే కాంగ్రెస్ రెండు లిస్టులను విడుదల చేసింది. సోమవారం సాయంత్రం మరో జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మూడు స్థానాలు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ సుదీర్ఘ మంతనాలు జరిపింది. కానీ చర్చలు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. ఇంకోవైపు సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం కూడా మొదలెట్టేశారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనేది మాత్రం తేలలేదు. మొత్తానికి ప్రతిష్టంభన మధ్య ఆప్ సోమవారం తొలి జాబితాను విడుదల చేసేసింది. 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరనట్లుగా తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినా సఫలీకృతం కాలేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు.. కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలిశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ వీరి సమావేశం సర్వత్రా ఆసక్తిగా మారింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఉన్నప్పుడే వినేష్ ఫోగట్ కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల పంజాబ్-హర్యానా సరిహద్దులో అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు వినేష్ ఫోగట్ మద్దతు తెలిపింది.
Rahul Gandhi: హర్యానా ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. వచ్చే నెల మొదటివారంలో ఈ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే, వరసగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుంటే, ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు కూడా తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి.
త్వరలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దీంతో ఇండియా కూటమిలోని మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కనిపిస్తోంది.