Vinesh Phogat: వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు.. మోడీ ఫోన్ చేస్తే పట్టించుకోలేదని వ్యాఖ్య
- వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు
- మోడీ ఫోన్ చేస్తే పట్టించుకోలేదని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌లో అనర్హతకు గురైనప్పుడు ప్రధాని మోడీ నుంచి ఫోన్ కాల్ వస్తే మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల బరువు కారణంగా వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడింది. దీంతో ఆమెను ఓదార్చడానికి ప్రధాని మోడీ ఫోన్ నుంచి కాల్ వచ్చింది. అయితే తాను మాట్లాడటానికి నిరాకరించినట్లు వినేష్ తెలిపారు. తనకు నేరుగా మోడీ నుంచి ఫోన్ కాల్ రాలేదన్నారు. అక్కడ ఉన్న భారత అధికారులు తన దగ్గరకు వచ్చి మోడీ మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు. అందుకు సిద్ధంగానే ఉన్నానని.. కానీ అధికారులు మాత్రం షరతులు పెట్టారని చెప్పారు. తన బృందం నుంచి ఎవరూ మాట్లాడకూడదని.. ప్రధాని మోడీ నుంచి మాత్రం ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియా కోసం సంభాషణను రికార్డ్ చేస్తారని చెప్పారు. ఈ పరిణామం తనకు రుచించలేదన్నారు. అసలే నిష్క్రమణకు గురైన బాధతో ఉంటే.. తన భావోద్వేగాలను, కృషిని సోషల్ మీడియాలో ఎగతాళి చేసుకోవడానికి ఇష్టపడలేదని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
ఇది కూడా చదవండి: Israel: ఇజ్రాయెల్‌కు భారీ ఎదురుదెబ్బ.. లెబనాన్‌లో 8 మంది సైనికుల మృతి
ఎలాంటి షరతులు లేకుండా ప్రధాని మోడీ నేరుగా ఫోన్ చేసి ఉంటే మాట్లాడేదాన్ని అని వివరించారు. అంతేకాకుండా తప్పకుండా అభినందించేదానిని అని పేర్కొన్నారు. నిజంగా అథ్లెట్ల గురించి శ్రద్ధ వహిస్తే రికార్డు చేయకుండా కాల్ చేసే ఉండేవారన్నారు. అప్పుడు తాను కృతజ్ఞత కలిగి ఉండేదాన్ని అని వివరించారు. ‘‘నాతో మాట్లాడితే గత రెండేళ్ళ గురించి అడుగుతానని పీఎం మోడీకి తెలిసి ఉండవచ్చు. బహుశా అందుకే నా వైపు నుంచి ఫోన్ మాట్లాడే బృందం ఉండకూడదని అధికారులు సూచించారు. ఇలా అయితే.. వారు మాట్లాడిన వీడియో వారికి అనుకూలంగా ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. మాములుగా మాట్లాడితే.. నేను ఒరిజినల్ కాల్‌ను బయటపెడతానని వారికి తెలుసు’’ అని వినేష్ ఫోగట్ అన్నారు.
పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇంటికి చేరుకున్నాక ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం హర్యానాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: KTR: కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!