Haryana Polls: వినేష్ ఫోగట్‌పై కెప్టెన్‌ను బరిలోకి దింపిన బీజేపీ.. ఎవరీ ఈ కెప్టెన్ అంటే..!
- వినేష్ ఫోగట్‌పై కెప్టెన్‌ను బరిలోకి దింపిన బీజేపీ
- బీజేపీ స్పోర్ట్స్ సెల్ కో కన్వీనర్‌గా ఉన్న కెప్టెన్ యోగేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాజకీయ వాతావరణం వేడుక్కుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ఇప్పటికే కొంత మంది అభ్యర్థులను వెల్లడించాయి. దీంతో ప్రత్యర్థులు ఎవరనేది తేలిపోతుంది. మంగళవారం బీజేపీ 21 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. దీంతో రాజకీయ ప్రత్యర్థులపై క్లారిటీ వస్తోంది.
ఇది కూడా చదవండి: Samsung: ‘‘మడత పెట్టినప్పుడు చెప్పండి’’..ఆపిల్ ఐఫోన్ 16పై సామ్‌సంగ్ సెటైర్లు..
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరి జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. హస్తం పార్టీలో చేరిన కొద్ది సేపటికే ఈ స్థానాన్ని కేటాయించింది. తాజాగా వినేష్ ఫోగట్‌పై కమలం పార్టీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. మంగళవారం ప్రకటించిన రెండో జాబితాలో జులానా బీజేపీ అభ్యర్థిగా బీజేపీ యూత్ లీడర్ కెప్టెన్ యోగేశ్ బైరాగిని బరిలోకి దింపింది. దీంతో వినేష్ ఫోగట్ వర్సెస్ కెప్టెన్ యోగేశ్‌గా మారింది. జులానాలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని వినేష్ ఫోగట్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఆమె వ్యాఖ్యానించారు.
కెప్టెన్ ఎవరు?
కెప్టెన్ యోగేష్ బైరాగి భారతీయ జనతా యువమోర్చా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అలాగే బీజేపీ స్పోర్ట్స్ సెల్ (హర్యానా) కో-కన్వీనర్‌గా కూడా ఉన్నారు. వినేష్ ఫోగట్ కాంగ్రెస్ నుంచి జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమెపై బలమైన అభ్యర్థి యోగేష్ అని కమలం పార్టీ భావించింది.
బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో ఇద్దరు ముస్లిం అభ్యర్థులకు కూడా సీట్లు కేటాయించడం విశేషం. ఫిరోజ్‌పూర్ ఝిర్కా నుంచి నసీమ్ అహ్మద్, పునాహనా నుంచి ఐజాజ్ ఖాన్ జాబితాలో ఉన్నారు. బీజేపీ మొత్తం ఇప్పటి వరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా రెండు స్థానాలకు అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుండగా.. ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి:Devara: దేవర దిగాడు.. వయలెన్స్ ఓవర్ లోడెడ్.. ట్రైలర్ అదిరింది చూశారా?
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!