డబుల్ ఇంజన్ పాలన అంటే తిరోగమన పాలన అంటూ బీజేపీ పై మంత్రి హరీష రావు మండిపడ్డారు. అమిత్ షా నిధులు మీకు అందాయా అని అడిగే కంటే ముందు, తెలంగాణ కు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా చెప్పండని ప్రశ్నించారు. నియామకాల గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపి కి లేదని మండిపడ్డారు. మోడీ రెండు కోట్ల ఉద్యోగాల నియామకాల ప్రకటన బోగస్ అంటూ విమర్శించారు. మా వైపు ఒక్క వేలు చూపిస్తే.. మీ వైపు రెండు…
15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదని మంత్రి హరీష్ రావు మండి పడ్డారు. సిద్దిపేట పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి హరీష్ రావు. అనంతరం జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత కానిస్టేబుల్ శిక్షణ పొందిన విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విధ్యార్థులు ఆత్మవిశ్వసంతో చదివి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. విధ్యార్థుల భవిష్యత్ బాగుండాలని మంచి…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 22వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్రావు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆస్పత్రిని నందమూరి తారకరామారావు ప్రారంభించారని.. తెలుగు అంటే అందరికీ ఎన్టీఆర్ పేరు గుర్తుకువస్తుందని బాలయ్య అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా హాస్పిటల్ స్టార్ట్ చేశామని తెలిపారు. తన తల్లి…
సైనికుల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత విధ్వంస చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. అగ్నిపథ్తో ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళం పాడుతోందని ఆయన ఆరోపించారు. దాడుల వెనుక ఇక్కడ టీఆర్ఎస్ హస్తం ఉంటే.. యూపీలో ఎవరి హస్తం ఉన్నట్లు అని ఆయన ఎద్దేవా…
జూన్ నెలలోనే 9,200 గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అందరూ అన్ని పోస్టులకు పరీక్ష రాసేందుకు వీలుగా ఒక దాని తర్వాత మరోక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నామని వివరించారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో పోరాడి 95…
ధరణి పోర్టల్ ఒక అద్భుతం అని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం ఉదయం ములుగు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ధరణి పోర్టల్ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో ధరణి పోర్టల్ సమస్యలపై హరీష్రావు ముఖా ముఖి నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ములుగు గ్రామ రెవెన్యూ సమస్యలు తీర్చి ఇదే విధంగా రాష్ట్రం అంత చేద్దాం అని ఆలోచన ఉందన్నారు. గతంలో రిజిస్ట్రేషన్ కోసం అనేక సమస్యలు ఉండేదని తెలిపారు. ధరణి వచ్చాక…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై మంత్రి హరీష్ రావు కీలక కామెంట్లు చేశారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధిని పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని ఆయన అన్నారు. తాగునీరు, సాగునీరు, మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నామని.. విడిపోయి మన అభివృద్ధి చెందితే , వారు వెనుకపడి పోయారని అన్నారు. ఇతర రాష్ట్రాలకు పోయి చూస్తే మన తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో తెలుస్తుందని ఆయన అన్నారు. కేంద్రం అన్ని ప్రభుత్వం ఆస్తులను…
తెలంగాణకు మాటలు, గుజరాత్ కు మూటలు దక్కతున్నాయని మంత్రి హరీష్ రావు బీజేేపీ పార్టీపై ఫైర్ అయ్యాడు. నర్సాపూర్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రంలో అదికారంలోకి వస్తే ఆర్టీసీని అమ్ముతుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలపై బీజేపీ పాలసీ ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు…
రాస్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. నార్మర్ డెలవరీలను ప్రోత్సహించేందుకు కీలక ప్రకటన చేశారు. నార్మల్ డెలివరీలు చేయిస్తే రూ. 3000 పారితోషకం ప్రకటించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలు నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దాం అని సూచించారు. సిజేరియన్లను ప్రోత్సహించ వద్దని కోరారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలని అన్నారు. నార్మల్ డెలివరీలు ఎక్కువగా పెరగాలని.. ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రికి తేడా…
నారాయణపేట జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ.64కోట్ల 43 లక్షల 19 వేలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అప్పక్ పల్లి గ్రామ శివారులో రూ.56 కోట్ల వ్యయంతో 390 పడకల జిల్లా…