Harish Rao: మోటార్లు కావాలా? మీటర్లు కావాలా? మునుగోడు ప్రజలు ఆలోచించుకోవానలి మంత్రి హరీశ్ రావ్ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ ఎన్నిక ప్రజల ఆత్మ గౌరవానికి పరీక్ష అని అన్నారు. కోట్లు పెట్టి ప్రజలను కొనాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. గీత కార్మికులకు, చేనేత కార్మికులకు ఒంటరి మహిళలకు ఎయిడ్స్ పేషెంట్లకు, డయాలసిస్ పేషెంట్లకు అన్ని వర్గాకలు 2,016రూ పెన్షన్ ఇచ్చి ఇవాళ ప్రజలకు కడుపులో పెట్టుకుని కాపాడు కున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ తెచ్చిపెట్టింది మునుగోడులో బీజేపీ అధికార దుర్వినియోగం పాల్పడి గెలవాలని అనుకుటుందని అన్నారు. నాయకులను కొనుగోలు చేయడమే కాదు. కార్లు ,మోటార్ సైకిళ్ళు నేతలకు బీజేపీ కొనిస్తదట అంటూ ఆరోపించారు. 200 బ్రిజా కార్లు ,2 వేల మోటార్ సైకిల్ లు కొనడానికి బీజేపీ బుక్ చేసింది. మేము వీటిపై పార్టీ తరఫున నిఘా పెడతామన్నారు.
Read also: Uttar Pradesh: ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్‌తో ఏడుగురు మృతి
ఈసీకి ,పోలీసులకు పిర్యాదు చేస్తామని మంత్రి హరీశ్ అన్నారు. ఇప్పుడు రాజగోపాల్ మోటార్లు ఇస్తారు… ఆ తర్వాత బాయి కడ మీటర్లు పెట్టిస్తారు అంటూ ఎద్దేవ చేశారు. మునుగోడు లో బీజేపీకి చెప్పుకోవడానికి ఏమి లేదని అన్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెంచాము. అందుకోసం ఓటు వేయమని బీజేపీ అడుగుతుందా? అంటూ ప్రశ్నించారు. మోడీ సర్కార్ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడము మొదలుపెట్టిందని అన్నారు. మహిళకు ,మైనార్టీలకు మోడీ హయాంలో రక్షణ లేదని హరీశ్ అన్నారు. చేనేత కార్మికులకు ఉన్న అన్ని పథకాలను మోడీ సర్కార్ తీసివేసిందని.. మోడీ సర్కార్ ఒక్క మంచి పని చేసింది? అని ఎద్దేవ చేశారు. క్షుద్రపూజలు మీకు అలవాటు మాకు కాదంటూ బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావ్ చురకలంటించారు.