సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు బస్టాండ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ,, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. గాంధీ జయంతి రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని పటాన్ చెరులో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా వుందన్నారు. గాంధీజీ కి కొండా లక్ష్మణ్ బాపూజీ కి దగ్గర పోలికలు ఉన్నాయి.
విదేశీ వద్దు….. స్వదేశీ ముద్దు అంటూ ఉద్యమంలో పాల్గొన్నారు.. స్వాతంత్ర్య సమరంలో, తర్వాత తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. లాయర్ గా చాకలి ఐలమ్మ భర్త కేసును రూపాయి తీసుకోకుండా వాదించారు. తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిన మహొన్నత వ్యక్తి. కేంద్ర ప్రభుత్వం చేతివృత్తుల ను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి అమ్మటమే తప్ప, అభివృద్ధి చేయడం తెలియదు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ని అధికారికంగా నిర్వహిస్తున్నాం అన్నారు. పద్మశాలి సమాజాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం అన్నారు మంత్రి హరీష్ రావు.
Read Also: Adipurush Teaser: న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం..!!
గాంధీ గారికి గుడి కట్టించిన వ్యక్తి ఎమ్మెల్యే GMR. గాంధీ గారు లేకపోతే స్వేచ్ఛ వాయువులు పీల్చే వాళ్ళమా? దేశ స్వాతంత్రం కోసం తుదికంటా పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. ఇటీవల కొందరు గాంధీ గారిని కించ పరుస్తున్నారు. నేడు ప్రపంచమే గాంధీని ఆదర్శంగా తీసుకుంటోంది. ఎన్నో పోరాటాలు చేసి, ప్రజలకు ఒక్క తాటి పైకి తెచ్చిన వ్యక్తి గాంధీ. నేడు పటాన్ చెరుకే కళ వచ్చింది. అద్భుతమైన జంక్షన్ గా మార్చడం అభినందనీయం.
కరోనా సమయంలో అద్భుతమైన సేవలు అందించిన పోలీస్, వైద్యులు, సఫాయి కార్మికులు విగ్రహాలు ఏర్పాటు చేయడం సంతోషకరం అన్నారు. ప్రతి రంగంలో తెలంగాణ రాష్ట్రo కేంద్రం నుండి అవార్డ్స్ సాధిస్తుంది. మిషన్ భగీరథ కు నీతి ఆయోగ్ నిధులు ఇవ్వమన్న కేంద్రం ఇవ్వలేదు. తెలంగాణకు మిషన్ భగీరథ పథకానికి అవార్డు వచ్చిన సంకుచితంగా వ్యవహరిస్తున్నారు.తెలంగాణకు అవార్డులు వస్తున్నాయని కేంద్రం అవార్డ్స్ బంద్ చేస్తుంది కావచ్చు. తెలంగాణ ఏర్పాటుకు అడ్డం కాదు, నిలువు కాదు అన్న వాళ్ళు…ఇప్పుడు రాజకీయలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు… నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.
సఫాయి అన్న మీకు సలం అన్న అని సీఎం కేసిఆర్ గారు ప్రశంసించారు. బుల్ తరహాలో పటాన్ చెరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. అందుకే బుల్ విగ్రహం పెట్టాం అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయబోతున్నాం అన్నారు.
Read ALso: Pope Francis: ఇంకెంత రక్తపాతం జరగాలి.. దయచేసి పుతిన్, జెలన్ స్కీలు యుద్ధాన్ని ఆపాలి