కరోనా కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకుంటే వేరియంట్ల మీద వేరియంట్లు పుట్టుకొచ్చి భయపెడుతున్నాయి. దేశంలో తాజాగా రెండు కొత్త వేరియంట్లకు సంబంధించి కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా ఉద్ధృతి దేశంలో కాస్త తగ్గింది. కేసులు కూడా గతంతో పోలిస్తే బాగా తగ్గాయ్. అయితే ఒమిక్రాన్‌కు సంబంధించిన వేరియంట్లు ఒక్కొక్కటిగా బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని పూణేలో బీఏ4, బీఏ5 కరోనా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వీరందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.…
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబ రాజకీయాల మీద చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గురువింద గింజ తన కింద నలుపు చూసుకోవాలన్న ఆయన.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు బీజేపీలో లేడా? మీది కుటుంబ పార్టీ కాదా? పంజాబ్‌లో అకాళీదళ్‌తో అధికారాన్ని పంచుకోలేదా? అది కుటుంబ పార్టీ కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కుటుంబ రాజకీయాల గురించి మోదీ మాట్లాడటం నిజంగా సిగ్గు చేటని, మీ ఎత్తులు ఎత్తి…
తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య వ్యవస్థ చాలా దారుణంగా ఉందని కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, జగ్గా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. సనత్ నగర్లోకి 50 పడకల ఆసుపత్రిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ నేతలు కళ్ళున్నా ఏమీ కనిపించనట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, అద్భుతంగా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల…
హైదరాబాద్‌లో ఉస్మానియా ఆస్పత్రిపై కమిటీ త్వరగా రిపోర్ట్ ఇవ్వాలన్నారు మంత్రి హరీష్ రావు. ఉస్మానియా ఆసుపత్రిపై నియమించిన చీఫ్ ఇంజినీర్ల కమిటీ తన రిపోర్టును త్వరగా ఇవ్వాలని మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం సోమవారం ఎంసిఅర్ హెచ్ ఆర్ డి లో మంత్రుల బృందం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి చీఫ్ ఇంజనీర్ల కమిటీతో భేటీ అయ్యారు. హైకోర్టు సూచనలు,…
కేంద్రం పెట్రోల్, డిజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. కేంద్రం పెట్రోల్, డిజిల్ పై బారాణా పెంచి చారాణా తగ్గించిందని విమర్శించారు. మార్చి 2014లో ఉన్న ఎక్సైజ్ సుంకాలను తీసుకువచ్చి మాట్లాడంటూ సవాల్ విసిరారు. ఎందుకోసం బీజేపీ నేతలు పాలాభిషేకాలు చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పన్నులు పెట్రోల్, డీజిల్ పెంచలేదని అన్నారు. డాక్టర్లు సూది ఇచ్చినట్లు మెల్లిగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయని… డీజిల్, పెట్రోల్ తగ్గించినట్లు…
నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు చాలా మంది ప్రజాప్రతినిధులు.. అందులో మంత్రి హరీష్‌రావు ఇంకా ప్రత్యేకమనే చెప్పాలి.. తన నియోజకవర్గంలోనే కాదు.. ఇతర నియోజకవర్గాల్లోనూ పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు హాజరైన శుభాకాంక్షలు చెబుతుంటారు. అయితే, బిజీగా ఉండడంతో.. ఓ పెళ్లికి హాజరు కాలేకపోయారు మంత్రి హరీష్‌రావు.. దీంతో.. నూతన వధూవరులను వినూత్నంగా ఆశీర్వదించారాయన. Read Also: Krishna Janmabhoomi-Shahi Eidgah: మథుర షాహీ ఈద్గా కేసులో జులై 20న విచారణ పూర్తి…
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు 8 శాతం పెరిగాయని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం అమలు, పురోగతిపై ఆయన నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. 2019-20 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు 35 శాతం ఉంటే 2021-22లో 43 శాతం పెరిగాయని హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు పేదలకు వైద్యఖర్చులు భారం లేకుండా చేయాలని వైద్యాధికారులకు సూచించారు. అన్ని జిల్లాలు, ఏరియా…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ పర్యటనపై.. ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు సెటైర్ వేసిన విషయం తెలిసిందే. అయితే.. దానికి ప్రతిస్పందించిన బీజేపీ తెలంగాణ శాఖ నరసింహ జయంతిని ప్రస్తావిస్తూ హరీశ్ రావుకు కౌంటర్ వేసింది. హిరణ్యకశిపుడిని…
హైదరాబాద్ నగరంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.5కే భోజనం అందించే పథకం మొదలైంది. రోగులతోపాటు ఆస్పత్రులకు వచ్చే సహాయకుల కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఒకేరోజు 18 ఆస్పత్రుల్లో ప్రారంభించడం విశేషం. నగరంతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి నిత్యం ఎంతోమంది ప్రజలు వైద్యం కోసం రాజధానిలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటారు. ప్రతి రోగి వెంట వారి బాగోగులు చూసుకోవడానికి కుటుంబసభ్యులు వస్తుంటారు. ఇలాంటివారికి నామమాత్రపు ఖర్చుతో భోజనం అందించడం ఈ పథకం…
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ వివాదం టీఆర్ఎస్లో అగ్గి రాజేస్తోంది. అధికారులు చేస్తున్నారో లేక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెరవెనక చక్రం తిప్పుతున్నారో అర్థం కావడం లేదన్నది కేడర్ చెప్పేమాట. ఇటీవల మంత్రి హరీష్‌రావు పర్యటనలో జరిగిన నాటకీయ పరిణామాలు ప్రస్తుతం చర్చగా మారాయి. ప్రొటోకాల్ రగడ వర్గపోరు తీవ్రతను బయటపెట్టింది. మంత్రి హరీష్‌రావు ప్రారంభించిన మాతాశిశు కేంద్రం శిలాఫలకంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు కన్నా పైన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేరు చెక్కించారు. దీనిపై కొప్పుల…