Botsa Satyanarayana: రైతుల పాదయాత్రపై ఫైర్.. ఎందుకు సహకరించాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana Comments On Amaravati Farmers Padayatra: అమరావతి రైతుల పాదయాత్ర మీద ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రైతుల ముసుగులో టీడీపీ, రియల్ ఎస్టేట్ దోపిడీదారులు కలిసి.. ఈ అమరావతి పాదయాత్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అసలేం ఉద్ధరించడానికి వాళ్లు పాదయాత్ర చేస్తున్నారు? వారికి మేం ఎందుకు సహకరించాలి? అని ప్రశ్నించారు. అమరావతి భూముల్లో టీడీపీ నాయకులు దోచుకున్నారని, వాళ్లు ఎంత దోచుకున్నారో కూడా శాసనసభ సాక్షిగా తాము వెల్లడించామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీతో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక ఇదే సమయంలో.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పార్టీగా మార్చుకోవడం వాళ్ల ఇష్టమన్నారు. ఏపీలో ఉన్న అనేక పార్టీల్లో బీఆర్ఎస్ కూడా ఒక పార్టీ అవుతుందే తప్ప, ఆ పార్టీ ప్రభావం తమపై ఏమాత్రం ఉండదని తేల్చి చెప్పారు. పోటీలో ఎంత ఎక్కువ మంది ఉంటే, అంతే మంచిదని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
కాగా.. విజయనగరం మయూరీ కూడలి నుంచి వైఎస్ఆర్ జంక్షన్ వరకు అభివృద్ధి చేసిన రోడ్డు, సెంటర్ లైటింగ్, వాటర్ ఫౌంటెన్లపై బుధవారం రాత్రి చర్చించారు. అనంతరం ఎంపీ బెల్లం చంద్రశేఖర్, మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్లతో కలిసి రూ. 2.50 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాల్ని నిర్వహించారు. అంతకుముందు.. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీకి వచ్చి టీచర్లతో మాట్లాడాలని సూచించిన ఆయన.. తెలంగాణలో ఇస్తున్న పీఆర్‌సీని, ఏపీలో ఇస్తున్న పీఆర్‌సీతో పోల్చి చూడాలన్నారు. రెండు రాష్ట్రాల పీఆర్‌సీలను పక్కపక్కన పెట్టి చూస్తే.. అప్పులు అసలైన తేడా తెలుస్తుందన్నారు. అనవసరమైన వ్యాఖ్యలు ఎందుకని మంత్రి బొత్స నిప్పులు చెరిగారు.
Also Read
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!