అంధత్వం నుంచి విముక్తి అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనతో ప్రారంభించిన కంటి వెలుగు అద్భుతంగా కొనసాగుతోందని కొనియాడారు.
సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. డేట్-టైమ్ ఫిక్స్ చెయ్, నేను రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని గ్రామంలో జైలు నుండి విడుదలైన కమలాపూర్ కార్యకర్తలను పరామర్శించిన బండి సంజయ్ ఈ వాఖ్యలు చేశారు.
తెలంగాణ ఏర్పాటులో ఫిబ్రవరి 18 అత్యంత ముఖ్యమైన రోజుగా గుర్తింపు ఉంది. ఆ రోజే తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. అది 2014 ఫిబ్రవరి 18.. తెలంగాణ కొత్త చరిత్రకు నాంది పలికిన రోజు.
యాదాద్రి, కొండగట్టు తరహా ఏడుపాయలు ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.