మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో కనీసం తాగు నీరు లేక నానా అవస్థలు పడ్డారని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ వల్లే రాష్ట్రంలో మంచినీటి సమస్య లేకుండా చేశారని ఆయన అన్నారు. సొంత జాగలో ఇండ్లు కట్టుకుంటే మూడు లక్షలు ఇస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. అది మహిళ పేరు మీదనే ఇస్తామన్నారు. పక్కనే గోదావరీ ఉన్నా తాగునీటి కోసం బిందెలు పట్టుకొని పోయే వాళ్ళు.. ఇప్పుడా పరిస్తితి పోయిందన్నాడు.
Also Read : Pawan Kalyan: ఒక్కరోజుకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
తెలంగాణలో త్వరలో న్యూట్రిషన్ కిట్ ఇస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్- బీజేపీ వాళ్ళు సొల్లు మాటలు చెప్పుతారు.. రేవంత్ రెడ్డి ఛత్తీస్ ఘడ్ పాలన అంటున్నాడు..
ఛత్తీస్ గడ్ పాలన అంటే అయిదు వందల పెన్షన్ ఇస్తారా అని హరీశ్ రావు విమర్శిస్తారు. పండించిన ధాన్యం కొనుగోలు చేయని ఛత్తీస్ గడ్ పాలన తెలంగాణకు తెస్తావా రేవంత్ రెడ్డి అంటూ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Smriti Irani: రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్.. దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్
తెలంగాణకు సమాదులు తవ్వేటోడు కావాలా పునాదులు వేసే కేసీఆర్ కావాలా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రం కాపి కొడుతుంది. తెలంగాణ ఎం చేస్తుందో రేపు దేశం అదే చేస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ అనుసరిస్తుంది.. దేశం ఆదరిస్తుంది.. ఒకరు ప్రగతి భవన్ కూలగొడుతా.. ఇంకొక్కరు సమాధులు తవ్వుతా అంటున్నారు.. అలాంటి నాయకులు మనకు కావాలా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణలో పల్లెల రూపురేఖలను సీఎం కేసీఆర్ మార్చారని మంత్రి హరీశ్ రావు అన్నారు.