బీజేపీ వాళ్ళు వంకర మాటలు మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్‌రావు. ఇవాళ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్, సుకన్య సమృద్ది చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 వేలు సరిపోతాయా అని సన్నాయి నొక్కులు నొక్కతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ 10 వేలు ఇస్తున్నారు, నువ్వో 10 వేలు కేంద్రం నుంచి తే.. రైతుకు 20 వేలు ఇద్దామని ఆయన బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. బీజేపీ వాళ్లు మాట్లాడమంటే మస్తుగా మాట్లాడతారని, వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇస్తున్నారా.? అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లతో పంటలు బాగా పండుతున్నాయని, కాళేశ్వరం నీళ్లతో పంట పండిస్తున్న రైతులు వీళ్ల మాటలు వింటే వాళ్ళను హౌలా గాళ్లని అనుకోరా..? అని ఆయన అన్నారు.
Also Read : Kakani Govardhan Reddy: వాళ్లు ద్రోహం చేశారు.. అందుకే పార్టీ వారిని సస్పెండ్ చేసింది
తెలంగాణ లెక్క పాలన కావాలని, సంక్షేమ పథకాలు కావాలని ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఛత్తీస్ ఘడ్ లో పంట కొననే కొనరట అంటూ ఆయన ధ్వజమెత్తారు. కేంద్రం మరోసారి పంట కొనమని చేతులెత్తేసింది.. కేసీఆర్ ప్రతి గింజ కొంటారని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పార్టీ సభ్యులు ప్రమాదవశాత్తూ చనిపోతే పార్టీ సభ్యత్వం ఇన్సూరెన్స్ ద్వారా ఇప్పటి వరకు 44మందికి 90లక్షల రూపాయలు సహాయం అందించినట్లు వెల్లడించారు. 38మంది రైతులకు అసైన్డ్ భూమి పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమన్నారు.
Also Read : Sayyesha Saigal: స్టార్ హీరో భార్యవి..ఒక బిడ్డ తల్లివి.. ఇలా ఐటెంసాంగ్ చేయడం ఏంటి అమ్మడు